Modi : గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి వచ్చే రూ.6 వేలు అందుకోండి ఇలా..
Modi : పేద, మధ్యతరగతి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని స్టార్ట్ చేసింది. దీనికి భూమి కలిగి ఉన్న ప్రతి అన్నదాత ఫ్యామిలీకి సంవత్సరానికి రూ.6వేలు ఇస్తుంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో దీనిని రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి పదో విడత డబ్బులను ఈ నెల1 న పీఎం మోడీ రిలీజ్ చేశారు. 351 ఎఫ్‌పీఓలకు రూ.14 కోట్లు విడుదల చేశారు. దీని వల్ల 1.24 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి అందుతుందని అంచనా వేశారు.
గతంలో ఈ పథకం కింద కేవలం రెండు హెక్టార్ల కంటే తక్కువగా భూమి ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించేవారు. కానీ ప్రస్తుతం పీఎం కిసాన్ ద్వారా చిన్న భూస్వామ్య ఫ్యామిలీలకు సైతం లబ్ధి చేకూరుతోంది. మరి మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి ఇలా..www.pmkisan.gov.in అనే వెబ్ సైట్‌లోకి వెళ్లండి. తర్వాత అందులోని హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి.
Modi : ఇలా అప్లై చేసుకోండి
లోపలికి వెళ్లాక కొత్త రైతు నమోదు అనే ఆప్షన్ పై నొక్కండి. అలా చేయగానే రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులోకి వివరాలన్నింటిని పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పై నొక్కండి. అందుకు సంబంధించిన హార్డ్ కాపీని సేవ్ చేసుకోండి. దీనికి అప్లై చేసుకునేందుకు భూమి అసలు పత్రాలు, దరఖాస్తుదారుడి బ్యాంక్ పాస్ బుక్కు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం వంటింవి ఉండాలి. వీటి ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.