Ys jagan mohan reddy: వైసీపీలో వారందరికీ జగన్ షాక్ ఇవ్వబోతున్నారా..?
Ys jagan mohan reddy: వైసీపీలోని సీనియర్ నాయకులందరికీ అక్కడే స్థానం కల్పించాలని సీఎం జగన్ మోహన్‌రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. సీనియర్ నేతలందరినీ అసంబ్లీకి దూరంగా ఉంచాలని ఉంచాలని సీఎం జగన్ బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసారి చాలా మంది సీనియర్లకు టిక్కెట్ కూడా దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. వారందరికీ పార్టీలో కీలక పదవులు ఇచ్చి, ప్రభుత్వ పరంగా దూరంగా ఉంచాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Ys jagan mohan reddy: ఇక సీనియర్ల సూచనలు.. సలహాలు తీసుకోవాలని నిర్ణయం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు. అందు కోసం సీనియర్ల సలహాలు, సూచనలు, వ్యూహాలు అవసరం అని సీఎం జగన్ బావించారు. ఇక నుంచి వారిని ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం చేయకుండా పార్టీని గెలిపించే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. కరోనా ప్రారంభం అయిన నాటి నుంచి నేతలెవరూ ప్రజలలోకి వెళ్లడం లేదు. దీంతో సీనియర్ నేతలందరూ ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. రాజకీయ అనుభవం ఉన్న వారి ఎత్తుగడలు జిల్లాలకే పరిమితం చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సీఎం జగన్ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రతి వారం రెండు ఎమ్మెల్యే తమ అసెంబ్లీ పరిధిలో గ్రామ సచివాలయాలను సందర్శించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి రానున్న సాధారణ ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి సారించినట్టు పార్టీ నేతులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చె డిసెంబర్ నుంచి ప్రజలోకి వెళ్లి వారికి మరింత దగ్గర కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రారంభం అయిన నాటి నుంచి చాలా మంది సీనియర్ ఎమ్మెల్యే ప్రజలలోకి వెళ్లడం లేదు. వారి ఈ సారి ఖచ్చితంగా టిక్కెట్ ఇవ్వొద్దని సీఎం నిర్ణయించారు.
వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలు గత ప్రభుత్వాలలో కీలక పదవులో ఉన్నవారు. అందులో కొంత మంది సేవలు పార్టీ కోసం ఉపయోగించుకోవాలని, మరి కొంత మందిని మండలికి పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చె సాధార ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సీనియర్ నేతలకు పార్టీ పదవులు ఇచ్చి వారి వ్యూహాలను, ఎత్తుగడలు, సలహాలు, పార్టీ బలోపేతానికి వాడుకోవాలని ఇప్పటి నుంచి సీఎం వ్యూహాలు రచిస్తున్నట్టు చర్చ జరుగుతుంది.