Ministet Rajini : ఛిఛి.. కొత్త సంవత్సరం వేళ బీసీ మహిళా మంత్రి పై దాడి ..అసలేం జరిగింది..?
ప్రధానాంశాలు:
Ministet Rajini : ఛిఛి.. కొత్త సంవత్సరం వేళ బీసీ మహిళా మంత్రి పై దాడి ..!
Ministet Rajini : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎవరి సహాయం లేకుండా నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతుంది. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. మీ కుటుంబాలకు ఏదైనా మేలు జరిగిందనుకుంటేనే మాకు ఓటేయాలని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిస్తున్నారు. దీని ద్వారా ఆయన ప్రజలను నమ్ముకున్నారని తెలుస్తోంది. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక మరోవైపు ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, జనసేన పార్టీలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరైన వైఎస్సార్ సీపీ ని ఎదుర్కొనే ధైర్యం లేక దాడులు చేయడానికి మార్గంగా ఎంచుకోవడంపై టీడీపీ, జనసేన పార్టీపై విస్మయం వ్యక్తం అవుతుంది.
తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ మహిళా మంత్రి అయిన విడదల రజిని కార్యాలయాన్ని ద్వంసం చేశారు. ప్రస్తుతం విడుదల రజిని పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే వై.యస్.జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు గుంటూరు పశ్చిమ సీటును పార్టీ అధినేత జగన్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే విడదల రజిని ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన ఆఫీసు కూడా తెరిచి పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నారు. ఈ క్రమంలోనే విడదల రజిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరించడానికి తట్టుకోలేని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమె ఆఫీస్ ని రాత్రికి రాత్రే కొత్త సంవత్సరం నాడు ధ్వంసం చేశారు. ఆఫీసు అద్దాలు పగలకొట్టి ఫ్లెక్సీలు చించేశారు.
నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబుపై మొదటి నుంచి విడతల రజిని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే టిడిపి ఆమెను టార్గెట్గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెను భయపెట్టే ఉద్దేశంతో ఆమె కార్యాలయాన్ని జనసేన కార్యకర్తలు కలిసి ధ్వంసం చేయించారని అంటున్నారు. ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి తేల్చుకోవాల్సింది పోయి ఇలా దాడులు చేయటం ఏంటని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్, చంద్రబాబు చెబుతున్నారని, మరి విడతల రజిని కార్యాలయం పై దాడిని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని, ఈ విషయం దాడి ఘటన తోటే అర్థమైందని అంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా విడుదల రజిని ఆఫీస్ పై ఆ పార్టీల కార్యకర్తలు దాడి చేయరని వారి అనుమతితోనే దాడి జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.