Rajini : సీఐకి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజిని
ప్రధానాంశాలు:
Rajini : సీఐకి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజిని
Rajin : విడదల రజిని మరియు సీఐ సుబ్బారాయుడు మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వివాదానికి సంబదించిన పలు వీడియోలు చక్కర్లు కొట్టగా ..తాజాగా ఈ వివాదానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సీఐ సుబ్బారాయుడు, శ్రీకాంత్ రెడ్డిపై కేసు ఉందని,

Rajini : సీఐకి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజిని
Rajini నా కారుమీద చెయ్యి వేస్తావా..? పోలీసులకు మాజీ మంత్రి రజిని ధమ్కీ
అతనిని తమతో పంపించాల్సిందేనని స్పష్టం చేస్తూ కనిపించగా, కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులకు అప్పగించమంటూ ఆయన ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీడియోలో విడదల రజిని స్పష్టంగా “కేసు లేదు, అరెస్ట్ ఎందుకు?” అని ప్రశ్నిస్తూ “పక్కకి జరగండి” అంటూ పోలీసులను నిలదీశారు. పోలీసు అధికారుల తీరు సరికాదని ఆమె వాదించారు. కారులో ఎవరు ఉన్నా, సరైన ఆధారాలు లేకుండా పోలీసులు ఇలా గొడవకు దిగడమేంటి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది న్యాయ విరుద్ధమని, ప్రజా ప్రతినిధిగా తాను అన్యాయానికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. అంతే కాదు “కారును తాకొద్దు, ఇది మీ విధికి మించి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. మాజీ మంత్రిగా, ఆమె అధికారిక హోదా ఉన్నప్పటికీ ఇలా పోలీసుల నుంచి ఎదుర్కొంటున్న అవమానంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.