Electric Bike : తెలంగాణలో తయారైన ఎలక్ట్రిక్ బైక్.. బుల్లెట్ బండిలా ఉంది.. బుకింగ్ ధర రూ.999 మాత్రమే.. ఈ బైక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Electric Bike : పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల కన్నా.. ఎలక్ట్రిక్ బైక్ లకు ఇప్పుడు తెగ డిమాండ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనం ఇస్తున్నాయి. తాజాగా బుల్లెట్ బండి రేంజ్ లో ఉండే ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. అది ఎక్కడో తయారైంది కాదు.. మన తెలంగాణలో తయారైన ఎలక్ట్రిక్ బైక్ అది. దాని పేరు అటుమ్ వేడర్. హైదరాబాద్ లోని పటాన్ చెరువులో ఈ బైక్ తయారయింది. అటుమ్ వేడర్ కంపెనీ.. ఈ తరహా.. ఎలక్ట్రిక్ బైక్స్ ను మరో 30000 తయారు చేయనుందట.
ఈ బైక్ అసలు ధర రూ.99,999 మాత్రమే కానీ.. దీన్ని బుక్ చేసుకుంటే బుకింగ్ ఆఫర్ కేవలం రూ.999 మాత్రమే. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద కేవలం రూ.99,999 కే తొలి వెయ్యి మందికి ఈ బైక్ ను కంపెనీ అందిస్తోంది. ఈ బైక్ ను సొంతం చేసుకోవాలనుకుంటే.. అటుమ్ వేడర్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రూ.999 చెల్లిస్తే చాలు. బైక్ ను ప్రీ ఆర్డర్ చేసినట్టే. ఈ బైక్ మొత్తం 5 కలర్ల వేరియంట్స్ లో లభిస్తుంది. రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, గ్రే కలర్. ఈ బైక్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

atumvader electric bike launched in telangana
Electric Bike : అటుమ్ వేడర్ వెబ్ సైట్ లో బుక్ చేసుకోండిలా
దీనికి ఎలక్ట్రిక్ కేప్ రేసర్ బైక్ గా నామకరణం చేసింది కంపెనీ. ఈ బైక్ లో 2.4కే డబ్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కనీసం 5 గంటలు చార్జింగ్ చేస్తే బైక్ ఫుల్ చార్జ్ అవుతుంది. సింగిల్ సీటర్, సెల్ఫ్ స్టార్టింగ్, ఎల్ఈడీ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ స్పీడూ మీటర్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, 14 లీటర్స్ బూట్ స్పేస్, ట్యూబ్యులర్ చేసిస్, స్వాపింగ్ బ్యాటరీస్ లాంటి ఫీచర్లు ఈ బైక్ సొంతం. అటుమ్ కంపెనీ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ బైక్ మాత్రం ఇదే. 2020 లోనే అటుమ్ 1.0 పేరుతో ఓ బైక్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను రిలీజ్ చేసింది. ఈ బైక్ కు రిజిస్ట్రేషన్, హెల్మెట్ తప్పనిసరి. గంటకు 65 కిమీల వేగంతో ఈ బైక్ ను నడపొచ్చు.