TRS Party : టీఆర్ఎస్ పార్టీకి కీలక నేత గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన
TRS Party : టీఆర్ఎస్ పార్టీకి TRS Party ఆ పార్టీ కీలక నేత సామ వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సామ వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ TRS Party తో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ Telangana ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy తో కలిసి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ను వెంకట్ రెడ్డి కలిశారు.
ప్రైవేట్ సెక్టార్‌లోనూ స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించేలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు.
ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు.. TRS Party
ప్రైవేట్ సెక్టార్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ అమలుచేయాలన్న తెలంగాణ Telangana ఉద్యమ ఆకాంక్షను టీఆర్ఎస్ TRS Party ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన కరువైందన్నారు. పరిశ్రమలు, యాజమాన్యాలకు అనుకూలంగా ఉండటం తప్ప ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే న్యాయంజరుగుతుందని కేసీఆర్ KCR నాయకత్వంలో పనిచేసినప్పటికీ.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా రాజకీయ లక్ష్యాల కోసం కేసీఆర్ పని చేస్తున్నారని సామ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాల్లో 70 రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ నెరవేర్చలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.
ప్రైవేటు ఉద్యోగుల సంఘం .. TRS Party
తమకు 33 జిల్లాల్లో ఉన్న కమిటీల్లో 40–50 వేల మందితో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం చాలా బలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నేతలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని భూములిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆ భూములు ఇవ్వడం ద్వారా ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో… ఆ ఆశయాలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో సామ వెంకట్ రెడ్డి కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌తో పనిచేస్తారని చెప్పారు.