Balakrishna : వైసీపీలో భయం స్టార్ట్ అయింది బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 7, 2023, 2:00 pm

Balakrishna : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో భయం స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ యువతకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. “యువగళమ్” అనే పేరు పెట్టిన గాని… అన్ని వర్గాల ప్రజల నుండి ఈ పాదయాత్రకి భారీ ఎత్తున స్పందన వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అసహనం ఇంకా సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ఇది పాదయాత్ర కాదు.. ఒక విప్లవం.

Balakrishna Solid Counters To CM Jagan At Nara Lokesh Yuvagalam Padayatra

Balakrishna Solid Counters To CM Jagan At Nara Lokesh Yuvagalam Padayatra

ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు మిగతా రాజకీయ పార్టీలు మొత్తం ఏకం కావాలి అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా సెటైర్లు వేశారు. అదంతా అంకెల గారడీ అని మండిపడ్డారు. ప్రజలంతా ఓటనే ఆయుధంతో సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. రాజధాని లేని రాష్ట్రం అసమర్ధ పరిపాలన.. అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు.

అల్లుడి యాత్రలో మామయ్య.. సైకో జగన్ అంటూ బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

నాలుగు సంవత్సరాలైనా పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదని బాలకృష్ణ విమర్శలు చేశారు. 8 లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేశారు. ఎవరికైనా మంచి చేశారా అని బాలకృష్ణ నిలదీశారు. పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఈ రకంగా వైసిపి పాలనపై లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో బాలకృష్ణ.. మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp