Balakrishna : మేమేం చేతులు కట్టుకుని కూర్చోలేదు.. వైసీపీకి బాలకృష్ణ వార్నింగ్..
Balakrishna : తాజాగా ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను అందరూ చూశారని తెలిపారు. అలాంటివి జరగడం బాధాకరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం సజావుగా జరగాల్సిన అసెంబ్లీని.. అలా జరగనివ్వకుండా దాని దృష్టి మరల్చి.. వ్యక్తిగత విషయాలను ఎజెండాగా పెట్టుకుని మాట్లాడటంతోనే చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిణామాలకు అంతకు ముందు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.
అసెంబ్లీలో ఉన్న సంప్రదాయం ఎంటంటే.. సమస్యలపై కొట్లాడటమని.. అసెంబ్లీ ఉన్నది అందుకేనని చెప్పాడు. మనం వేళెత్తి చూపడం లేదంటే సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి చేసుకుంటాం. మేము ఇచ్చిన సూచనలు నచ్చకుంటే వారు వాదించడం సహజం. ప్రతిపక్షం, అధికార పక్షం ఒకరితో ఒకరు వాదించడం కామన్ అని అన్నారు. వారి పార్టీలోనూ మహిళా శాసనసభ్యులు ఉన్నారు. వారంతా ప్రజలతో ఎన్నుకోబడిన వారేని తెలిపారు. అయితే అసెంబ్లీలో సలహాలు ఇవ్వడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.
Balakrishna : ఆ కామెంట్స్ సరికాదన్న బాలకృష్ణ..
అంతే కానీ చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరిపై చేసిన కామెంట్స్ సరికాదు. వైసీపీ నేతల భాష చూస్తుంటే మనం అసెంబ్లీలో ఉన్నామా? లేక గొడ్ల చావిట్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. మహిళలకు గౌరవం ఇవ్వకుండా ఇలా వ్యక్తగతంగా టార్గెట్ చేయడం సరికాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా.. ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం దురదృష్టకం. వైసీపీ నాయకుల ఇండ్లలోనూ ఆడవాళ్లు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వైసీపీ వారు ఇలా మాట్లాడటం మంచిది కాదు. భువనేశ్వరి చేస్తున్నట్టుగా వారేమైనా సమాజానికి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
దోచుకున్న సొమ్మంతా ఇంట్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. వారింట్లో ఆడవాళ్లు సైతం వాళ్లను చీదరించుకుంటున్నారన్నారు. ఆ విషయం వాళ్ల ఇంట్లో వాళ్లను అడగితే తెలుస్తుందని తెలిపారు. మేమేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. వాళ్ల ఫ్యామిలీలోనూ ఒక ఇష్యూ ఉంది. దానిని వాళ్ల ఫ్యామిలీ సభ్యులే ఒప్పుకున్నారు. అవును అనుమానం ఉందని అంటూ వివేక హత్య కేసు గురించి ఇండైరెక్ట్‌గా స్పందించారు.