Balineni : బాలినేని వైవీ వైరంలో అసలు స్టోరీ ఇదే !
Balineni : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అంతే కాదు.. ఎన్నికల కంటే కూడా ముందు పార్టీలలో ఒకరికి మరొకరు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు జిల్లా వైసీపీ పార్టీలో ముసలం మొదలైనట్టు తెలుస్తోంది. అది కూడా ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వైరమే ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశం అయింది.
పార్టీలో ఈ విషయం రోజురోజుకూ చర్చనీయాంశం అవుతుండటంతో బాలినేని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ భావోద్వేగానికి గురయ్యారు. కావాలనే తనను కొందరు వ్యక్తులు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. పార్టీ ఏర్పాటు నుంచి జగన్ కు నమ్మకస్తుడిలా, తన వెన్నంటే ఉన్న తనను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఈ ఇద్దరూ సీఎం జగన్ కు కావాల్సిన వాళ్లే. ఈ ఇద్దరూ పార్టీని జిల్లాలో కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే కాదు.. ఈ ఇద్దరు కూడా బంధువులే. వరుసకు బావ బామ్మార్దులు అవుతారు. కానీ..
Balineni : ఇద్దరూ జగన్ కు కావాల్సిన వాళ్లే
బంధుత్వాన్ని పక్కన పెట్టి ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులు అయిపోయారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ మధ్య బాలినేని మంత్రి పదవి పోవడంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని తప్పించి.. ఆదిమూలపు సురేశ్ ను మంత్రిగా కొనసాగించడంపై ఆయన అసంతృప్తి ఉన్నారు. ఆయన మంత్రి పదవి పోవడానికి కారణం వైవీ సుబ్బారెడ్డి అని తెలిసి.. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 2014 నుంచి వైసీపీకి నమ్మకస్తులుగా ఉండటంతో పాటు.. ఒంగోలులో వీళ్లదే రాజ్యం. 2014 లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని పోటీ చేయగా ఓడిపోయారు. కానీ.. వైసీపీ నుంచి పోటీ చేసిన సుబ్బారెడ్డి మాత్రం గెలిచారు. తన ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని అప్పటి నుంచి వీళ్ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అవి భగ్గుమన్నాయి.