Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో మంది మొగ్గు చూపుతుంటారు. కానీ ఇవి కొన్నిసార్లు చర్మానికి అనవసరమైన రసాయనాలను కలిగించి దుష్ప్రభావాలు కలిగించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో లభించే సహజ పదార్థాలతోనే చర్మాన్ని సంరక్షించుకోవడం ఎంతో మంచిది.

#image_title
ఇలా చేయండి..
అందులోనూ అరటిపండు తొక్క మంచి సహజ బ్యూటీ టిప్ లాగా పనిచేస్తుంది. అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదే, కానీ చాలామంది తొక్కను నేరుగా పడేస్తారు. కానీ ఆ తొక్కను చర్మ సంరక్షణకు వినియోగిస్తే ముఖం నిగారింపుగా మెరుస్తుంది. అరటిపండు తొక్కలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి చర్మాన్ని శుభ్రపరుస్తాయి.మృత కణాలను తొలగించి నూతన కణజననాన్ని ప్రోత్సహిస్తాయి
టానింగ్, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ చేసి, ప్రకాశవంతంగా మారుస్తాయి. అరటిపండు తొక్కతో ఇంటి వద్దే ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేయండి.అరటిపండు తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయండి. అందులో అర చెంచా బియ్యం పిండి, అర చెంచా చక్కెర కలపండి. మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్‌గా తయారుచేసి ముఖానికి అప్లై చేయండి.20–30 నిమిషాలు ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి . అరటి తొక్క + తేనెతో కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. అరటి తొక్క + పెరుగు గ్రైండ్ చేసిన అరటి తొక్కలో రెండు చెంచాల పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ లా అప్లై చేయండి. ఇది మచ్చలను తగ్గించి, చర్మానికి గ్లో తెస్తుంది.