Bandi Sanjay : కేసీఆర్… ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నావా? బండి సంజయ్ ఆగ్రహం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : కేసీఆర్… ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నావా? బండి సంజయ్ ఆగ్రహం?

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 April 2021,9:43 am

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బండి సంజయ్.

band sanjay alleges that trs party makes money with politics

band sanjay alleges that trs party makes money with politics

అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలతోనే డబ్బులు సంపాదిస్తోందన్నారు. అలా డబ్బులను సంపాదించి…. తెలంగాణలో రాజకీయాలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay : సీఎం ఒక్కసారి కూడా జయంతి వేడుకలకు ఎందుకు రాలేదు?

బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఇన్నేళ్లుగా జరుగుతున్నా… సీఎం కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా జయంతి ఉత్సవాలకు రాలేదు. ఎందుకు సీఎం ఉత్సవాలను రావడం లేదు. ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారా? ఇకనైనా సీఎం కేసీఆర్ తన తీరు మార్చుకోవాలి.. అని బండి సంజయ్ విమర్శించారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల మాటేమిటి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అన్నారు. ఏది? అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది. మరి.. దీని గురించి దళిత సామాజిక సంఘాలు ఎందుకు కేసీఆర్ ను ప్రశ్నించడం లేదు. అంబేద్కర్ విగ్రహం విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎందుకు కేసీఆర్ ను నిలదీయడం లేదు…. అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొన్నది. త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందుకే…. చాన్స్ దొరికితే చాలు.. ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలను వదలడం లేదు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది