Bank Holidays : మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు పని చేస్తాయో తెలుసా? ఇన్ని హాలీడేసా?
Bank Holidays: ప్రస్తుత జీవితంలో బ్యాంకులు సైతం మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఆర్థికంగా ఏ పని అవసరమున్నా.. అందుకు బ్యాంకుకు వెళ్లక తప్పదు. ప్రస్తుతం డిజిటల్ జనరేషన్‌లో కొంత మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నప్పటికీ.. వాటిపై అవగాహన లేని వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం మార్చి నెలలో ఆర్థిక లావాదేవీలు చేసేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మార్చి గురించే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగియనుంది. దీనికి తోడు బ్యాంకులకు పలు పండుగల కారణంగా సెలవులు సైతం వస్తున్నాయి. వీటితో పాటు సాధారణ సెలవులు కలుపుకుని మొత్తంగా 8 రోజులు హాలీడేస్ ఉన్నాయి.
Bank Holidays : మార్చి 1న స్టార్ట్..
హైదరాబాద్ రీజియన్‌లో అంటే తెలంగాణ, ఏపీలో బ్యాంకుల సెలవులు చూస్తే… మార్చి 1న మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చిలో హాలీడేస్ మొదలుకానున్నాయి. ఇక 6వ తేదీన ఆదివారం, 12వ తేదీన రెండో శనివారం, 13వ తేదీన ఆదివారం, 18వ తేదీన హోళీ, 20వ తేదీన ఆదివారం, 26వ తేదీన నాలుగో శనివారం, 27వ తేదీన ఆదివారం ఇలా మొత్తంగా ఎనిమిది రోజులు బ్యాంకులు మూతపడతున్నాయి. ఇదిలా ఉండగా కొందరు టూర్లు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే సిబ్బంది సైతం కొంత తక్కువగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా వేర్వేరు రీజియన్లలోని బ్యాంకులకు సెలవులు పెరగనున్నాయి. వాటిని పరిశీలిస్తే.. మార్చి 3న లోసర్ గ్యాంగ్‌టాక్, 4వ తేదీన చప్చార్ కుట్, 17వ తేదీన హోళికా దహన్.. దీనిని ఎక్కువగా డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీలో జరుపుకుంటారు. 19న హోళీ మరుసటి రోజు సెలవు. ఇది భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో వర్తించనుంది, 22న బిహార్ దివస్ ఇది పాట్నాకు పరిమితం. ఇలా వివిధ రీజియన్లలో సెలవులు వర్తించనున్నాయి. బ్యాంకులకు ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకోవడానికి https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ఓపెన్ చేసి చూడండి.