Job Notification : డిగ్రీ క్వాలిఫికేషన్‌తో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
Job Notification : కరోనా మహమ్మారి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఆగిపోయాయి. కాగా, పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీకి ఆయా సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాల్లోకెళితే..బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేసేందుకుగాను బ్యాంకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారంగా..
మరో ఐదు రోజుల్లో అప్లికేషన్‌కు గడువు ముగియనుంది. మొత్తం 25 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్‌కు ఏజ్ లిమిట్ 40 ఇయర్స్‌గా నిర్ణయించారు. క్యాండిడేట్ 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి.వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అప్లై చేసుకునేందుకుగాను అభ్యర్థులు .. బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్.. అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
Job Notification : గడువు ముగిసే లోపే దరఖాస్తు చేసుకోండి..
వెబ్ సైట్‌లో కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అనంతరం రిక్రుట్ మెంట్ ఆఫ్ సపెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అనే లింక్ ఓపెన్ చేయాలి.అనంతరం ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకుగాను క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అందులో మీ వివరాలు మొబైల్ నెంబర్ తదితరాలు ఎంటర్ చేయాలి. ఇకపోతే మీరు అలా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.అలా అప్లికేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్‌ను భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అది భవిష్యత్తులో అవసరమయ్యే చాన్సెస్ ఉంటాయి.