Health Tips : వేడినీళ్లతో స్నానం ఎక్కువసేపు చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : వేడినీళ్లతో స్నానం ఎక్కువసేపు చేస్తున్నారా..? అయితే మీరు ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి…!!

Health Tips : చాలామంది స్నానం గంటలు గంటలు చేస్తూ ఉంటారు. అది మనకి తెలిసిన విషయమే. వేడి వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీటి స్నానం వలన వాళ్లకి శరీరం చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అలసట నుంచి బయటపడతారు. కానీ వేడి నీటితో స్నానం చేయడం శరీర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అది శరీరంపై చర్మంపై […]

 Authored By prabhas | The Telugu News | Updated on :23 January 2023,6:00 am

Health Tips : చాలామంది స్నానం గంటలు గంటలు చేస్తూ ఉంటారు. అది మనకి తెలిసిన విషయమే. వేడి వేడి నీళ్లతో స్నానం చేసే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీటి స్నానం వలన వాళ్లకి శరీరం చాలా యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే అలసట నుంచి బయటపడతారు. కానీ వేడి నీటితో స్నానం చేయడం శరీర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అది శరీరంపై చర్మంపై ఎన్నో చెడు ప్రభావాలను చూపుతుంది. జుట్టు ఎదుగుదలపై ఎఫెక్ట్ : స్నానానికి వాడే నీళ్లు ఎక్కువగా వేడిగా ఉంటే తల పైన రక్త ప్రసరణ వేగం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు కాబట్టి జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.

జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. చర్మం పొడిబారి పోతుంది : మన చర్మం లో నుండి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చర్మ సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసిన బాత్ డబ్బులోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్న దానిలోని వేడి వలన ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడి వారి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మొటిమలు : ఇప్పటికే మొటిమల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే వేడినీటి స్నానంతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని అమెరికా డాక్టర్లు తెలియజేస్తున్నారు.

Bathing with Vedi niru for a long time

Bathing with Vedi niru for a long time

వేడినీళ్ల వల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో చర్మంలోని కణాలు నశిస్తాయని వీటితో మొటిమలు మరింత ఎక్కువ అవుతాయని తెలిపారు. చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా ఈ వేడినీళ్ల స్నానంతో చనిపోతుంది. హైపర్ టెన్షన్ : వేడినీళ్ల స్నానం నరాలకు హాయిని కలిగించిన రక్తప్రసరణ పై ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్త ప్రసరణ వేగం పెంచి హైపర్ టెన్షన్కు కారణం అవుతుందని అమెరికా వైద్య నిపుణులు అధ్యయనంలో పరిశోధన చేసి తెలుసుకున్నారు.. సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారి పోతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు నిరంతరం వేడి నీటితో స్నానం చేస్తే మీ చర్మం కూడా దెబ్బతింటుంది. కాబట్టి చర్మం మరింత పొడి వారితో ఉంటుంది దీనికి ఫలితంగా చర్మ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది