
#image_title
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. 2019లో బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ రూ.6059 కోట్లుగా ఉంది. 2024 నాటికి రూ.20,686 కోట్లకు చేరుకుంది. అంటే గత ఐదేళ్లలో రూ.14,627 కోట్ల మేర బ్యాలెన్స్‌ను పెంచుకుంది. గత ఆర్థిక సంవత్సరమే రూ.4193 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి.
#image_title
కాస్త తగ్గుదల..
బీసీసీఐ సాధారణ నిధి దాదాపు రెట్టింపు అయిందని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. 2019లో రూ.3,906 కోట్లు ఉండగా 2024లో రూ.7,988 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. అంటే రూ 4082 కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేసింది. బీసీసీఐ ఆర్థిక విజయానికి ప్రధాన కారణాలు ఐపీఎల్ నుంచి వచ్చిన లాభాలు, ఐసీసీ నుంచి వచ్చిన ఆదాయం.కాగా.. 2023లో వన్డే ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగా, దీంతో మీడియా హక్కుల ఆదాయం 2524.80 కోట్ల నుంచి 813.14 కోట్లకు పడిపోయింది.
అయితే బీసీసీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 533.50 కోట్ల నుంచి 986.45 కోట్లకు పెరగడం విశేషం. బీసీసీఐ ఆర్థిక సంవత్సరంలో 3,150 కోట్ల రూపాయలను ఆదాయపు పన్ను బాధ్యతల కోసం కేటాయించింది. ఐపీఎల్ ఆదాయాలు, ఐసీసీ పంపిణీల సహాయంతో బీసీసీఐ 2023-24కి రూ.1,623.08 కోట్ల మిగులును నమోదు చేసింది. ఇది గత సంవత్సరం రూ.1,167.99 కోట్ల కంటే ఎక్కువ మొత్తం. 2023-24 సంవత్సరానికి బీసీసీఐ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,200 కోట్లు, ప్లాటినం జూబ్లీ బెనివలెంట్ ఫండ్ కోసం రూ.350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించింది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.