Tulsi Leaves | యవ్వనంగా కనిపించాలని అనుకుంటున్నారా.. అయితే పరిగడుపున ఈ నీరు తాగండి..!
Tulsi Leaves | రోజు పొడవునా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తినే, తాగే పదార్థాలు శరీరానికి శక్తినిచ్చేలా ఉండాలి. ముఖ్యంగా సహజసిద్ధమైన పానీయాలు శరీరానికి మేలు చేస్తాయి. అందులో తులసి ఆకుల నీరు ఒకటి. తులసి ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఔషధ మొక్కగా గుర్తించబడ్డాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీటిని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

#image_title
నిత్యం గ్లాసు నీరు..
ఈ నీరు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. తులసిలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. చర్మ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
అలాగే, చర్మ సమస్యలు, ముఖ్యంగా మొటిమలు వంటి ఇబ్బందులు ఉన్నవారికి తులసి టీ లేదా కషాయం ఎంతో ప్రయోజనం ఇస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా, కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అందువల్ల, ప్రతి రోజు ఉదయం తులసి నీటితో రోజును ఆరంభించడం ఆరోగ్యానికి, అందానికి రెండింటికీ మేలు చేస్తుంది.