Credit Card : క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా…?
Credit Card : ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ వాడకం బాగా పెరిగింది. బ్యాంకులు కూడా ఖాతాదారులను క్రెడిట్ కార్డ్ తీసుకునేలా వాటిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది అసలు క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి లాభాలు ఉంటాయో క్రెడిట్ కార్డు నుంచి ఏ విధంగా లాభపడవచ్చో తెలియదు. కొందరు దానికి ఉపయోగించడం తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన కల్పిస్తోంది. క్రెడిట్ కార్డులో బిల్ జనరేట్ డేట్, డ్యూ డేట్ అని రెండు ఉంటాయి. ఈ రెండింటిని అస్సలు మర్చిపోకూడదు. బిల్ జనరేషన్ డే అంటే ఆరోజు క్రెడిట్ కార్డుతో చేసిన చెల్లింపులను పరిగణలోకి తీసుకొని బిల్ ని జనరేట్ చేస్తుంది.
బిల్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ రోజు లేదా అంతకంటే ముందే క్రెడిట్ కార్డ్ బిల్లును కట్టాల్సి ఉంటుంది. కట్టడం లేట్ అయితే అదనంగా పెనాల్టీ వేస్తారు. సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. అందుకే ఎప్పుడు డ్యూ డేట్ లోపే చెల్లించాలి. అలా చేస్తే ఎలాంటి అదనపు ఫీజులు ఇబ్బందులు లేకుండా 40-45 రోజుల వడ్డీలేని పీరియడ్ ని వాడుకోవచ్చు. ప్రతి క్రెడిట్ కార్డుకు రివార్డులు ఇచ్చే విధానం ఉంటుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయని వాళ్ళు పరిగణలోకి తీసుకొని అందుకు తగినట్లుగా రివార్డ్స్ పాయింట్స్ ఇస్తుంటారు. అయితే ఎన్ని పాయింట్లు ఇస్తారు అనేది వాళ్ళ షరతులు, తీసుకునే క్రెడిట్ కార్డును బట్టి ఉంటుంది. అయితే ఆ రివార్డు పాయింట్లతో మీరు మళ్ళీ షాపింగ్ చేయవచ్చు. అన్ని బ్యాంకులు వారిచ్చే రివార్డు పాయింట్లను ఉపయోగించుకునేందుకు కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతుంది.
ప్రోడక్ట్ కు పెట్టిన పాయింట్లను బట్టి రివార్డులకు తగ్గట్లుగా వస్తువును ఎంచుకోవచ్చు. ఒకవేళ వస్తువుకు సరిపోను పాయింట్లు లేకపోతే ఎక్స్ట్రా ఎంత కట్టాలి చూపిస్తారు. అందుకు తగినట్లుగా రివార్డు పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్స్ ట్రావెల్ బెనిఫిట్స్ అని కూడా బాగా ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి ప్రత్యేకంగా ట్రావెల్ కార్డ్ ను తీసుకొచ్చాయి. వీటి వలన చాలా లాభాలు ఉంటాయి. రెండు, మూడు నెలలకు ఒకసారి ఫ్రీగా ఎయిర్పోర్ట్ లాంచ్ కి ప్రవేశం కల్పిస్తారు. కొన్నిసార్లు హోటల్స్ ఫ్రీగా స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ కార్డు వెనుక వైపు ఉండే సివివి వాలిడిటీ ఎక్స్పైరీ వంటివి ఎవరితో పంచుకోకూడదు. బ్యాంకులు కూడా అలాంటి సమాచారాన్ని అడగవు. షాపింగ్ సమయంలో బాగా నమ్మదగిన సైట్లలోనే సమాచారాన్ని ఎంటర్ చేయాలి.