Credit Card : వామ్మో .. క్రెడిట్ కార్డు రూల్స్ మళ్లీ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే మీకు దెబ్బె..!!
ప్రధానాంశాలు:
Credit Card : వామ్మో .. క్రెడిట్ కార్డు రూల్స్ మళ్లీ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే మీకు దెబ్బె..!!
Credit Card : క్రెడిట్ కార్డు వినియోగదారులకు జూన్ 1 నుంచి మారుతున్న కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కీలక ప్రకటన చేస్తూ, వివిధ ఖర్చులపై రివార్డు పాయింట్ల పరిమితులను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యుటిలిటీ బిల్లులు, విద్యా వ్యయాలు, వాలెట్ లోడింగ్, ఫ్యూయెల్, ఇంటి అద్దె, ప్రభుత్వ ఖర్చులు, ఇన్సూరెన్స్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వాటిపై ఖర్చులు మించితే ఇకపై రివార్డు పాయింట్లు అనేవి రావు. కొన్ని ఖర్చులపై అయితే పూర్తిగా రివార్డులు రాకుండా చేస్తూ కొత్త పాలసీని అమలు చేయనున్నారు.

Credit Card : వామ్మో .. క్రెడిట్ కార్డు రూల్స్ మళ్లీ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే మీకు దెబ్బె..!!
Credit Card : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఈ మార్పులు కోటక్ ప్రివీ లీగ్ సిగ్నేచర్, మోజో ప్లాటినం, జెన్ సిగ్నేచర్, కోటక్ 811, డిలైట్, ఫార్చూన్, 6ఈ రివార్డ్స్ కార్డులు వంటి పలు కార్డులకు వర్తించనున్నాయి. అలాగే రివార్డు పాయింట్ల విలువను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకు కోటక్ రాయలే, లీజ్, అర్బనే కార్డులపై పాయింట్ల విలువ రూ.0.10 నుంచి రూ.0.07కు, కోటక్ 811 కార్డుపై రూ.0.25 నుంచి రూ.0.10కు తగ్గించనున్నారు. ఇన్‌ఫినిటీ, ఎన్ఆర్ఐ రాయలే సిగ్నేచర్ కార్డులకు అయితే రూ.1 పాయింట్ విలువను రూ.0.70కు కుదించారు.
ఇకపై రెంట్ లేదా విద్యా ఖర్చులపై 1% అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యుటిలిటీ, వాలెట్ లోడింగ్, గేమింగ్, ఫ్యూయెల్ వంటి అన్ని లావాదేవీలపై కూడా ఒక శాతం ఫీజు వర్తిస్తుంది. అంతేకాకుండా ఫైనాన్స్ చార్జీలు, ఫ్యూయెల్ సర్‌చార్జ్, డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజులు పెంచారు. ఫీజుల సమీక్షతోపాటు, రివార్డుల పరిమితులతో వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, కోటక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ముందస్తుగా అవగాహన పెంచుకుని, తమ ఖర్చులపై కొత్త విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.