Big Breaking News : పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక అప్‌డేట్..!
ప్రధానాంశాలు:
Big Breaking News : పెట్రోల్, డీజిల్ కొరతపై కీలక అప్‌డేట్..!
Big Breaking News : హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో వాహనాదారులంతా పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ట్యాంకర్ డ్రైవర్ల నిరసనతో పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులను పెట్టేశారు.ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో ఇంధన కొరత ఏర్పడింది.హెచ్పి, బిపిసి, ఐఓసి కంపెనీల నుంచి పెట్రోల్ తీసుకెళ్లే ట్యాంకర్ డ్రైవర్లు చర్లపల్లి ఆయిల్ కంపెనీల వద్ద ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం నుంచి డ్రైవర్లు నిరసనలు చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేస్తూ ప్రమాదం చేసి పారిపోతే పదేళ్ల శిక్షతో పాటు ఏడు లక్షలు జరిమానాలతో కఠిన శిక్ష పడేలా చట్ట సవరణ చేశారు.దీంతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఈ నిబంధనలు తమకు గుదిబండలా మారాయని వెంటనే వెనక్కి తీసుకోవాలని ధర్నాకు దిగారు.
రోజు ఈ మూడు కంపెనీల నుంచి 18 వేల కిలో మీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుంది. వీరి నిరసనలతో ఒక్క ట్యాంకర్ కూడా బయటకు వెళ్లలేదు. వీరి నిరసనలతో హైదరాబాదులో సగానికి పైగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వెంటనే చర్లపల్లి లోని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లను చేస్తున్న నిరసనను విరమింప చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో పలు బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రి వరకు అన్ని బంకులలో యధావిధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే హైదరాబాదులోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
దాదాపు అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు వాహనదారులు క్యూలు కట్టారు. రెండు రోజులు పెట్రోల్ బంకులు బంద్ అనడంతో ఒక్కసారి పెట్రోల్ బంకులు ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. ముందు జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని బంకులలో పెట్రోల్, డీజిల్ లేక నో స్టాక్ బోర్డు పెట్టి మూసేశారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్ యజమానులు పాటించడం లేదని కొన్ని నో స్టాక్ బోర్డులు పెట్టిన బంకులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ 30% నిల్వ ఉంచుకోవాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వాటిని కొందరు పెట్రోల్ బంకులు పాటించడం లేదు. అయితే ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ సమ్మె లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ కు సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర చట్టం సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్లు యధావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు.