bigg boss 5 telugu : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు bigg boss 5 telugu సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతోందట. గత సంవత్సరం కూడా కరోనా సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 4 ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. మిగితా మూడు సీజన్ల కన్నా కూడా సీజన్ 4 సూపర్ సక్సెస్ అయింది. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం రెట్టించిన ఉత్సాహంతో సీజన్ 5 కి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీజన్ 5 కి సంబంధించిన కంటెస్టెంట్లు ఫైనల్ అయిపోయారట. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడితే.. వెంటనే స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారట.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ 5 కోసం సెట్ ను సిద్ధం చేశారట. ఇప్పటికే బిగ్ బాస్ 5 ప్రారంభం కావాల్సి ఉంది కానీ.. కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. కంటెస్టెంట్లను ఫైనల్ చేసి సిద్ధంగా ఉండాలని చెప్పారట. కరోనా సెకండ్ వేవ్ తగ్గగానే వెంటనే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు మాత్రం తెగ హడావుడి చేస్తుంది. కంటెస్టెంట్లు అందరికీ జూమ్ ద్వారా ఇంటర్వ్యూ చేశారని.. జూమ్ ద్వారానే సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. బిగ్ బాస్ రియాల్టీ షోలో అతి ముఖ్యమైనది హోస్ట్. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే తీసుకున్నారట. గత రెండు సీజన్లకు కూడా హోస్ట్ గా నాగార్జునే ఉన్నారు. మొదటి, రెండో సీజన్ల కన్నా.. మూడు నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో.. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక.. ఫైనల్ అయిపోయిన కంటెస్టెంట్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, యాంకర్ వర్షిణీ, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్ టాక్ దుర్గారావ్, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ లను ఇప్పటికే జూమ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీళ్లను త్వరలోనే క్వారంటైన్ కు కూడా పంపించనున్నారట. ఇక.. అన్నీ ఓకే అయితే.. జులైలో బిగ్ బాస్ 5 ని ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.