Sonusood : మరోసారి సోనూసూద్ దాతృత్వం.. ఏడాది చిన్నారికి హార్ట్ సర్జరీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Sonusood : మరోసారి సోనూసూద్ దాతృత్వం.. ఏడాది చిన్నారికి హార్ట్ సర్జరీ

Sonusood : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేదలకి ఏ క్షణాన ఎలాంటి అవసరం వచ్చిన నేనున్నాను అంటూ నటుడు సోనూసూద్ తన అభయ హస్తాన్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతక ముందు సోనూసూద్ అంటే ఓ నటుడుగానే పరిచయం. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించేవాడు. ఆ రకంగా జనాలలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండేది. ముఖ్యంగా అరుంధతి సినిమాలో పోషించిన పసుపతి పాత్ర జనాల మనసులో సోనూని […]

 Authored By govind | The Telugu News | Updated on :6 June 2021,9:12 am

Sonusood : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పేదలకి ఏ క్షణాన ఎలాంటి అవసరం వచ్చిన నేనున్నాను అంటూ నటుడు సోనూసూద్ తన అభయ హస్తాన్నిస్తున్న సంగతి తెలిసిందే. అంతక ముందు సోనూసూద్ అంటే ఓ నటుడుగానే పరిచయం. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించేవాడు. ఆ రకంగా జనాలలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండేది. ముఖ్యంగా అరుంధతి సినిమాలో పోషించిన పసుపతి పాత్ర జనాల మనసులో సోనూని మరీ విలన్ ని చేసేసింది. ఇక కమర్షియల్ సినిమాల పరంగా చూస్తే సోనూకి అంత క్రేజ్ నిజంగా ఉండేది కాదు.

కానీ గత ఏడాది కరోనా బారిన పడిన వారికి..దీని వల్ల ఉపాది కోల్పోయిన వారికి..అన్నీ రకాలుగా అండదండలు చూపించాడో అప్పటి నుంచి సోసైటీలో సినీ ప్రేమికుల్లో సోనూసూద్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు నటుడుగా కంటే ఓ సమాజ సేవకుడిగా కనిపిస్తున్నాడు. ప్రజలే ఆయనని ఇప్పుడు దేవుడుగా భావిస్తున్నారు. ప్రతీ పార్టీ నాయకులు సోనూ సోవను ప్రశంసిస్తున్నారు. ఇంత చేస్తున్న సోనూసూద్ మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవన్నీ ఆయన చేస్తున్న సేవ ముందు అలా రాలిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ జన సేవకుడు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఏడాది చిన్నారి ప్రాణాలకు రక్షగా నిలిచాడు.

sonu sood saved a chaild tejakrishna by heart surgery

sonu sood saved a chaild tejakrishna by heart surgery

Sonusood : చిన్నారి తేజాకృష్ణ ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్దిపల్లి మండలం రాజాపురం గ్రామానికి భాస్కరరావు, సత్య దంపతులకు తేజాకృష్ణ అనే ఏడాది కొడుకున్నాడు. ఆటో నడుపుకునే భాస్కరరావు కొడుకు తేజకు గుండె జబ్బ రావడంతో.. ఆపరేషన్ చేయాలనీ వైద్యులు చెప్పారు. దీని కోసం తమ ఆర్ధిక పరిస్థితికి మించి ఖర్చు పెట్టారు భాస్కరరావు. ఇదే సమయంలో విషయం తెలుసుకున్న జన విజ్ఞాన వేదిక సోషల్ మీడియా లో షేర్ చేసింది. చిన్నారిని ఆదుకోవాలంటూ సోనూని కోరింది. దాంతో వెంటనే స్పందించిన సోనూ, తేజకు వైద్యం చేయించే బాధ్యతను తీసుకున్నారు. ముంబయిలోని ఎస్‌ఆర్‌సీసీ పిల్లల ఆసుపత్రిలో గురువారం రోజు శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి తేజాకృష్ణ ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది