Siri : ఇంటి లోపల సిరి, గేటు బయట జస్వంత్.. ఈ ఇద్దరికి ఎంత కష్టం వచ్చింది..!
Siri: బిగ్ బాస్ షో ద్వారా హౌజ్‌మేట్స్ మధ్య స్నేహం చిగురిస్తున్న సంగతి తెలిసిందే. కొందరైతే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నారు. సీజన్ 5 ద్వారా షణ్ముఖ్, సిరి, జస్వంత్ ముగ్గురు త్రిమూర్తులుగా మారారు. హౌజ్‌లో ఉన్నప్పుడు గ్రూపుగా జతకట్టి రచ్చ చేసిన ఈ ముగ్గురు బయటకు వచ్చాక కూడా సందడి చేస్తున్నారు. అయితే త్రిమూర్తులలో ఒకరిగా ఉన్న సిరి రీసెంట్‌గా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తన ఇన్‌గ్రామ్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. కోవిడ్ లక్షణాలుగా అనిపిస్తుంటే టెస్ట్ చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు, స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్నాయని ఆమె తెలిపారు.
కరోనా వచ్చినప్పటి నుండి ఐసోలేషన్‌లో ఉన్న సిరిని కలిసేందుకు ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. కాని జస్వంత్ మాత్రం పలు జాగ్రత్తలు తీసుకొని ఆమె ఇంటి బయట నుండి వీడియో షూట్ చేశాడు. ఇంటి లోపల సిరి ఉండగా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కాస్త దూరంలో జస్వంత్ ఉన్నాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు తెగ ప్రేమ చూపించుకుంటున్నారు. జస్వంత్ తన ఇన్‌స్టా స్టోరీలో సిరితో తాను చేసిన సందడికి సంబంధించిన వీడియోలు షేర్ చేయగా, వీటిపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Bigg boss 5 Telugu Jaswanth shares a video of meeting Siri Hanmanth
ఇక సిరి హన్మంత్ విషయానికి వస్తే.. యూ ట్యూబర్‌గానే కాకుండా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రీసెంట్‌గా సినిమాల్లోనూ నటించారు. బిగ్ బాస్ హౌస్‌లోకి రాక మునుపు శ్రీహాన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత షణ్ముక్ జశ్వంత్‌తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హగ్గులు, కిస్సులతో ఇద్దరూ రెచ్చిపోయారు. దీంతో రెండు జంటలు కూడా దూరం దూరంగా ఉంటున్నాయి.