Hyper Aadi : సిరిపై పంచ్… హైపర్ ఆదిని బుద్ది ఉందా అంటూ విమర్శిస్తున్న జనాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : సిరిపై పంచ్… హైపర్ ఆదిని బుద్ది ఉందా అంటూ విమర్శిస్తున్న జనాలు

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2022,12:00 pm

Hyper Aadi : ఈటీవీలో ప్రసారం కాబోతున్న దసరా ప్రత్యేక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులని నవ్వించాడు. అదే మాదిరిగా ఇప్పుడు చేసినట్లుగానే ఇతరులపై అవమానకరమైన వ్యాఖ్యలను చేస్తూ అవతలి వారిని ఇబ్బంది పెట్టాడు ఆ పంచ్ లు వేయబోతున్నట్లుగా ముందే హైపర్ ఆది వాళ్లకు చెబుతాడట. అయినా కూడా వారు ఆ సమయంలో ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది. ఎంతో మంది సీనియర్ లను అవమానకరంగా వ్యాఖ్యలు చేసే హైపర్ ఆది తాజాగా సిరి హనుమంతు పై తనదైన శైలి పైత్యపు కామెడీ పంచ్ వేశాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఒక షన్నూ కి మాత్రమే నువ్వు ఫన్ ఇచ్చావు కానీ ప్రేక్షకులకు ఇవ్వలేదు అన్నట్లుగా హైపర్ ఆది కామెంట్ చేశాడు. అప్పుడు సిరి హనుమంతు కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో సిరి మరియు షన్నూ బాగా దగ్గరయ్యారు, వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చర్చించుకున్నారు. కేవలం ఆ రిలేషన్ వల్లే షన్నూ కి బిగ్ బాస్ ట్రోఫీ దకాల్సింది దక్కలేదు అనడంలో సందేహమే లేదు. బయటికి వచ్చిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఇద్దరు కూడా అసలు కలిసిందే లేదు. బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరు కేవలం రేటింగ్‌ కోసమే అలా నటించారు అనేది చాలా మంది ఇప్పటికి నమ్ముతున్నారు.

hyper aadi punch on biggboss siri and shannu in dasara event

hyper aadi punch on biggboss siri and shannu in dasara event

గడిచిపోయిన విషయాన్ని, కొన్ని చేదు సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకుంటేనే మంచిది కాదు. ఇప్పుడు సిరి తో ఆ విషయం మాట్లాడితే ఆమె కచ్చితంగా ఫీల్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయినా కూడా హైపర్ ఆది ఏమాత్రం మొహమాటం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ ఇష్టానుసారంగా కామెడీ పేరుతో అవతలి వారిని విమర్శిస్తూ ఉన్నాడు. ఇది ఆయన తీసుకొచ్చిన కొత్త రకం కామెడీ.. దీనిని చాలా మంది తప్పుపడుతున్నారు, అయినా కూడా అతను మాత్రం తన దైన శైలిలో ముందుకు సాగుతున్నాడు తప్పితే ఇతరులు బాధపడుతున్నారు కొందరు తిడుతున్నారు అని ఆలోచించడం లేదు. ఇతని ఈ కొత్త రకం కామెడీ ఎన్నాళ్ళు నవ్వు తెప్పిస్తుందో కానీ చిరాకు మాత్రం తెప్పించడం మొదలైంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది