Siri Hanumanth : సిరి హన్మంత్ బయట ఏం చేసిందో హౌస్ లో ఉన్న శ్రీహన్ కి తెలుసా ?? తెలిస్తే ఏమంటాడో !
Siri Hanumanth : సోషల్ మీడియా క్వీన్ సిరి హన్మంత్ ఈ మధ్యకాలంలో చాలా పాపులారిటీ సొంతం చేసుకుంది.గతంలో ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సిరి.. బిగ్‌బాస్ సీజన్-5లో కనిపించి చేసిన సందడి అంతా ఇంతా కాదు. సిరి హన్మంత్ దెబ్బకు బిగ్ బాస్ రేటింగ్స్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంత భారీ మొత్తంలో రేటింగ్స్ వస్తాయని బహుశా నిర్వాహకులు కూడా ఊహించి ఉండరు. సిరి హన్మంత్ ప్రస్తుతం బయట పెద్దగా కనిపించడం లేదు. బిగ్‌బాస్ సీజన్ పూర్తయ్యాక ఆమె వీడియోస్ చేయడం కూడా తగ్గించింది.
ఎందుకంటే సీజన్-5లో సిరి, షణ్ముక్ బిహెవియర్ చూసిన వారంతా ఏం మాట్లాడాలో తెలియక కొందరు మౌనం పాటిస్తే మరికొందరు తమకు నచ్చింది రాసేస్తూ వచ్చారు. ఇందులో సిరి షణ్ముక్ తప్పు లేదని బిగ్ బాస్ ఎలా చెబితే వీరు అలా చేశారని అనేవారు లేకపోలేదు. ఇక సీజన్-5లో సిరి షణ్ముక్ మధ్య స్నేహం కాస్త ప్రేమకు దారితీసిందని కొందరు కామెంట్స్ చేస్తే, అది ప్రేమ కాదు, కామంతో కూడా కొత్త రిలేషన్ అంటూ మరికొందరు ఆరోపించారు. దీనంతటికి హౌస్‌లో వీరిద్దరి క్లోజ్ నెసే కారణం. సిరికి, షణ్ముక్ ఇద్దరికి లవర్స్ ఉన్నారు. సిరికి శ్రీహాన్ ఉండగా.. షణ్ముక్ కోసం దీప్తి వెయిటింగ్.

Srihan in house knows what Siri Hanmant did outside
Siri Hanumanth : భవానీ మాతగా కొత్త దర్శనం
వీరి ఇంట్లో కూడా వివాహం గురించి చర్చ జరిగింది.ఇదంతా తెలిసి కూడా వీరు కావాలనే ముద్దులు, హగ్గులతో ఓవర్ చేశారు. ఫలితంగా దీప్తి షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పింది. ఇక శ్రీహాన్ ప్రస్తుతం సీజన్-6లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. శ్రీహాన్ మాత్రం సిరి హౌస్‌లో అంత చేసినా ఏమి అనలేదు.తనతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా సిరి దసరా పండుగ టైంలో భవానీ మాతగా దర్శనం ఇచ్చింది. సోషల్ మీడియాలో సిరి అమ్మవారి మాల ధరించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రియుడు శ్రీహాన్ టైటిల్ విజేతగా నిలవాలని కొత్త అవతారం ధరించారా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram