Deepthi Case : దీప్తి కేసులో అతిపెద్ద టర్నింగ్ ట్వీస్ట్.. దొరికిపోయిన చెల్లి అతని లవర్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Deepthi Case : దీప్తి కేసులో అతిపెద్ద టర్నింగ్ ట్వీస్ట్.. దొరికిపోయిన చెల్లి అతని లవర్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :4 September 2023,2:00 pm

Deepthi Case : జగిత్యాల జిల్లా సాఫ్ట్ వేర్ దీప్తి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనుమానస్పద స్థితిలో దీప్తి చనిపోవడం సంచలనం సృష్టించింది. ఇక ఇదే కేసులో ఆమె చెల్లి.. దీప్తి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవడం తెలిసిందే. అయితే ఈ కేసులో చెల్లెలు చందన పై అనుమానం రావటంతో..లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీప్తి చెల్లెలు బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయిన దృశ్యాలు బస్టాండ్ సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో దానిని ఆధారం చేసుకుని పోలీసుల బృందాలుగా గాలింపులు చేపడుతున్నారు. ఈ క్రమంలో దీప్తి చెల్లెలు.. బాయ్ ఫ్రెండ్ తో హైదరాబాదు శివారులలో దొరికిపోయారు. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దీప్తి చనిపోయిన తర్వాత పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపడితే మూడు రోజులకి.. దీప్తి చెల్లెలు దొరకటం జరిగింది.

మొదటి నుండి దీప్తి చెల్లెలిపై అనుమానం నెలకొన్న నేపథ్యంలో వాళ్లు పోలీసులకు చెప్పబోయేది.. కేసులో కీలకం కానుంది. మరోవైపు ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కూడా కీలకం కానుండటంతో.. అది వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. మృతురాలు దీప్తి వంటిపై గాయాలు చెయ్యి విరిగిపోయి ఉండటం.. వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీప్తి చనిపోక ముందు మూడు రోజుల క్రితం ఆమె చెల్లెలితో ఇంట్లోనే మద్యం పార్టీ చేసుకోవడం జరిగింది. దీప్తి వడ్క తాగగా… ఆమె చెల్లెలు బ్రీజర్ తాగింది. దీంతో మత్తులో సోఫాలో దీప్తి పండుకొని పోయింది. ఇదే సరైన సమయం అనుకొని దీప్తి ప్రియుడితో చందన వెళ్ళిపోయింది. ఇది చందన తన తమ్ముడికి వాయిస్ రికార్డ్ చేసిన సందేశం.

biggest turning twist in Deepthi Case

Deepthi Case : దీప్తి కేసులో అతిపెద్ద టర్నింగ్ ట్వీస్ట్.. దొరికిపోయిన చెల్లి అతని లవర్..!!

ఇలా ఉంటే చందన ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు రెండు లక్షల రూపాయల నగదు, 90 లక్షల రూపాయలు విలువ చేసే కిలోన్నర బంగారం..పాస్ పోర్ట్ తీసుకుని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అంత మాత్రమే కాదు చందన ప్రియుడు హైదరాబాదిగా పోలీసులు గుర్తించారు. చందన ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతని వివరాలు కూడా సేకరించారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరి సెల్ ఫోన్స్ ఆఫ్ లో ఉండటంతో పట్టుకోవడానికి పోలీసులు కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది.

అయితే దీప్తికి ఇంకా చందనాకి ఇంట్లోకి మద్యం బాటిల్స్ ఎవరు ఇచ్చారు ఆ సమయంలో ఇంట్లో ఎవరున్నారు అనేది ఈ కేసులో కీలకం కానుంది. మద్యం పార్టీ అయితే దీప్తి చనిపోవడానికి కారణమేంటి చందన పారిపోవడానికి అసలు హైదరాబాద్ నుండి లవర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనే రీతిలో పోలీసులు విచారణ చేస్తున్నారట.

Advertisement
WhatsApp Group Join Now

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది