ఈ యాప్ సహాయం తో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు ఐన సామాన్యుడు.. ఫుల్ స్టోరీ
డ్రీమ్ 11.. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఉపయోగించి చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన రాజు రామ్ డ్రీమ్ 11 అనే యాప్‌లో క్రికెట్ గేమ్ కోటి రూపాయలు గెలుపొంది అందరిని ఆశ్చర్యపరిచాడు.ఈ విషయం తెలుసుకొని ఆయన కుటుంబసభ్యులు చాలా సంతోషించారు.ఆయన గెలిచిన మొత్తం అతని ఖాతాకు కూడా బదిలీ చేయబడింది. అయితే గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 ప్లేయింగ్ యాప్‌లో గేమ్ ఆడుతున్నట్లు రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్లో రూ.49 పెట్టి గేమ్ ఆడగా,
అందులో అగ్రస్థానంలో నిలిచి కోటిరూపాయలు సంపాదించడం విశేషం. ఇంతకముందు రాజు చిన్న మొత్తంలో కూడా గెలుస్తూ ఉండేవాడు. తన గ్రామంలోనే డీజే ఆపరేటర్‌గా పని చేసే అతను చిన్నపాటి దుకాణం కూడా నడుపుతున్నాడు. కానీ, ఇంతలో రాజు రామ్ కోటి రూపాయలు దక్కించుకొని ఔరా అనిపించాడు. అతని ఫేట్ రాత్రికి రాత్రే మారిపోయింది. తాను గేమ్ ఆడుతున్న సమయంలో దాదాపు 35 లక్షల మంది ఒకేసారి ఆ గేమ్‌ను ఆడేవారని కూడా రాజు చెప్పారు. అతను బ్రిస్బేన్ హీట్ మరియు సిడ్నీ థండర్ జట్టు నుండి ఆటగాళ్లను ఎంపిక చేసి ఒక జట్టును తయారు చేసి, గెలిచి కోటి రూపాయలు గెలుచుకోవడం విశేషం. గెలుచుకున్న మొత్తంలో పన్ను తీసివేయగా.. రూ.70 లక్షలు అతడి అకౌంట్‌లో జమయ్యాయి. అయితే..
అదృష్టం అంతే అతడిదే..
రాజురామ్ కు వాలెట్ లో డబ్బులు ఎందుకు యాడ్ అయ్యాయన్న విషయం ముందు అర్థం కాలేదు. రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పాడు. అయితే.. దేశంలో పలు రాష్ట్రాలలో గేమింగ్ యాపులపై నిషేధం ఉంది. అయినా ఏదో ఒక రకంగా బెట్టింగ్ కాస్తూనే వస్తున్నారు. వచ్చిన వాళ్లకి డబ్బులు బాగానే వస్తున్నాయి. కొందరు చాలా నష్టపోతున్నారు. అయితే ఇంతకు ముందు బీహార్‌లోని అర్రాలో, ఆన్‌లైన్ గేమింగ్ యాప్ డ్రీమ్-11 నుండి ఒక వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్న విషయం విదితమే. అర్రా జిల్లా చార్పోఖారీ బ్లాక్ ఠాకూరి గ్రామానికి చెందిన వెంకటేష్ సింగ్ కుమారుడు సౌరభ్ కుమార్ డ్రీమ్-11 విజేతగా నిలిచి వార్తలలోకి ఎక్కాడు.