Bitter Gourd : కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు… జుట్టు కు కూడా ఎన్నో లాభాలు…!
ప్రధానాంశాలు:
Bitter Gourd : కాకరకాయ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు... జుట్టు కు కూడా ఎన్నో లాభాలు...!
Bitter Gourd : ప్రస్తుత కాలంలో ఎంతోమంది జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఎంతోమందికి జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, పొడిబారడం, చుండ్రు, తెల్ల జుట్టు లాంటి సమస్యలు చుట్టుపడుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి మీరు బయట పడాలంటే కాకరకాయ రసం చాలు అని అంటున్నారు నిపుణులు. అయితే కాకరకాయ అనేది ఎంతో చేదుగా ఉంటుంది. అయితే ఈ చేదు అనేది ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ కాకరకాయ రసం అనేది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాక చర్మం మరియు జుట్టు సమస్యలను కూడా నయం చేయటంలో హెల్ప్ చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఈ కాకరకాయను ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది అంటే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు…
అలాగే పొడిబారిన జుట్టుకు కూడా ఈ కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఈ కాకరకాయ రసం అనేది జుట్టుకు ఎన్నో సమస్యల నుండి కాపాడుతుంది. దీనిలో బి1, బి2, బి3, బీసి మరియు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్ ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో అవసరమైనవి. అలాగే జుట్టు సమస్యలకు కాకరకాయ రసం అనేది ఔషధంగా పనిచేస్తుంది. దీని కోసం ఒక అరకప్పు వరకు కాకరకాయ రసాన్ని తీసుకొని దీనిలో ఒక చెంచా కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని జుట్టు మాడకు పట్టించి ఐదు నుండి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 40 నిమిషాల పాటు దానిని ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారా నికి రెండు సార్లు గనక అప్లై చేసుకుంటే జట్టు రాలే సమస్యలను నయం చేస్తుందని అంటున్నారు. మీ జుట్టు గనుక రాలుతుంది అనుకుంటే కాకరకాయ రసంలో పంచదార కలిపి జుట్టుకు అప్లై చేసుకోండి. ఒక అరగంట తర్వాత శుభ్రంగా కడగండి. ఇలా మీరు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు రాలే సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. అంతేకాక ఇది మీ జుట్టు మూలల నుండి కూడా బలంగా చేస్తుంది. దీనికోసం కాకరకాయ ముక్కను తీసుకొని జుట్టు మూలాలపై రుద్దండి. అలాగే దీని రసాన్ని కూడా వాడవచ్చు. మీరు రోజు ఇలా గనక చేస్తే చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
జుట్టు పెరగటానికి కాకరకాయ జ్యూస్ ను కూడా వాడవచ్చు. ఈ కాకరకాయలో పోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. అంతేకాక కాకరకాయ రసం అనేది రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. అలాగే చేదు సొరకాయ రసాన్ని జుట్టుకు అప్లై చేసుకుంటే అది కొద్ది రోజుల్లోనే జుట్టు నేరిసిపోవడం ఆగిపోతుంది. అలాగే వారానికి ఒక్కసారి అయినా ఈ చిట్కాలను పాటించండి. దీనికోసం కాకరకాయ రసం మరియు పెరుగు ఒక కప్పు వరకు తీసుకోవాలి. అలాగే దీనిలో రెండు చెంచాల వరకు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మాడకు పట్టించి కొద్దిసేపు మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే పొడిబారిన జుట్టు మంచి నిగారింపును సొంతం చేసుకుంటుంది..