Vijayashanthi : ముందు కేసీఆర్ కు వెయ్యాలి ఫైన్.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు?
Vijayashanthi : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. అంటే.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈసమయంలో అత్యవసరమైన వాటి కోసం తప్పితే మరే దేనికి కూడా బయటికి వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే…. పగటి పూట ఎటువంటి నియంత్రణలు లేకుండా….. కేవలం రాత్రి పూట కర్ఫ్యూను పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం… దీని వల్ల సాధించేదేంటి… అంటూ బీజేపీ నేత విజయశాంతి ప్రశ్నించారు.
కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్… అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి.. సభల్లో పాల్గొని… ఆ ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీఎం కేసీఆర్ ను చూసి… మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు… అందరూ ఆయన బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది అని తెలిసాక కూడా ఒక ముఖ్యమంత్రి ఎందుకు కరోనా మహమ్మారిని లైట్ తీసుకున్నారని విజయశాంతి ట్విట్టర్ ద్వారా కేసీఆర్ ను ప్రశ్నించారు. మాస్క్ లు పెట్టుకోకుండా బయట తిరిగే ప్రజలకు కాదు ఫైన్ వేసేది… మాస్క్ లు లేకుండా సభలు, మీటింగ్ లు నిర్వహించిన కేసీఆర్ కు ముందు ఫైన్ వేయాలి అంటూ విజయశాంతి స్పష్టం చేశారు.
Vijayashanthi : కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం లేదు
తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు సంధించిన ప్రశ్నలను చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అర్థమవుతోంది. కరోనా టెస్టుల నిర్వహణ, కరోనా నియంత్రణ కోసం తీసుకుంటన్న చర్యలపై గత సంవత్సరం కూడా ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడూ హైకోర్టు చాలాసార్లు ప్రభుత్వంపై సీరియస్ అయింది. అయినప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. విద్యా సంస్థలను మాత్రం ముందే మూసేశారు. సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్ లు, క్లబ్ లు… ఇవన్నీ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న జనాలను మాత్రం కట్టడి చేయరు. బెడ్స్ కొరత ఉన్నా పట్టించుకోరు. కోర్టు ప్రశ్నలు అడిగితే నీళ్లు నములుతారు. మీదగ్గర సరైన సమాచారం లేదు కాబట్టే కదా…. ప్రభుత్వం మిమ్మల్ని నిలదీసింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఏ తప్పులు జరిగాయో… అవే తప్పులు మళ్లీ జరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది… అనే విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఇంకా తెలుసుకోవడం లేదు… ఎందుకు గుణపాఠం నేర్చుకోవడం లేదు… అంటూ విజయశాంతి ప్రశ్నించారు.
తెలంగాణలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అనిపిస్తోంది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 20, 2021