Black Coffee | బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి లాభాలే లాభాలు .. నిపుణుల సూచనలు ఏంటంటే.!
Black Coffee | రోజుకు ఒకటి రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చక్కెర లేదా పాలు లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీ జీవక్రియను మెరుగురచడంతో పాటు, కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
1. కాలేయ ఆరోగ్యం మెరుగవుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం, బ్లాక్ కాఫీ కాలేయంలో పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజితంగా ఉంచుతుంది.
2. బరువు తగ్గడంలో సహాయం
బ్లాక్ కాఫీలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల, ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహాయకారి. ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం శరీరంలో మెటబాలిజంను వేగవంతం చేస్తుంది.

#image_title
3. ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు సూచన
‘జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగే వారి మరణ ముప్పు తగ్గుతుందని తేలింది. దీని ప్రకారం, క్రమం తప్పకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఉంది.
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కెఫైన్ కాఫీ తాగే వారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
5. వ్యాధుల నివారణలో సహకారం
బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలో మంటలను తగ్గిస్తాయి. ఇవి కణాలను రక్షించడమే కాకుండా, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల నివారణకు కూడా సహాయపడతాయి.
ఆరోగ్య నిపుణులు రోజుకు 1 నుండి 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు. అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని సార్లు నిద్రలేమి, మానసిక ఉత్కంఠ వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అందువల్ల పరిమితంగా తీసుకోవడమే మంచిది.