Black Fungus : బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే.. బ్లాక్ ఫంగస్ వస్తే ఈ ఆసుపత్రులకే వెళ్లాలి
Black Fungus : ప్రస్తుతం కరోనా రోగులను భయపెడుతున్న మరో వ్యాధి బ్లాక్ ఫంగస్. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ఈ వ్యాధి సోకడం లేదు కానీ.. కరోనా రోగులను మాత్రమే ప్రస్తుతం ఇది తీవ్రంగా భయపెడుతోంది. బ్లాక్ ఫంగస్ అనేది ఓ ఫంగస్. ఈ ఫంగస్ వస్తే.. ముందు కళ్లు దెబ్బతింటాయి. కంటి చూపు పోతుంది. ఆ తర్వాత శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతిని చివరకు ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. మామూలుగా ఈ ఫంగస్.. ఆరోగ్యవంతుల జోలికి పోవడం లేదు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్ల జోలికి కూడా పోవడం లేదు కానీ.. కేవలం కరోనా సోకిన వాళ్లకే ఇదీ సోకుతోంది. కరోనా సోకిన వాళ్లకు రోగ నిరోధక శక్తి తగ్గుతుండటంతో.. అలాగే కరోనా రోగులకు డాక్టర్లు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇస్తుండటంతో.. బ్లాక్ ఫంగస్ సోకుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే.. బ్లాక్ ఫంగస్ వస్తే ఎటువంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి అనేదానిపై ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. బ్లాక్ ఫంగస్ కోసం కొన్ని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 100 లో ఒకరిద్దరికి ఈ బ్లాక్ ఫంగస్ సోకుతోంది. బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లలో ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు కూడా వస్తున్నాయి.
Black Fungus : బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే
హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకి.. బ్లాక్ ఫంగస్ కూడా సోకితే.. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వాళ్లలో ఆప్తల్మాలజీ అవసరం ఉన్నవాళ్లకు అయితే.. సరోజని దేవి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే.. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో కూడా బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లో గాంధీ, సరోజని దేవి, ఈఎన్టీ ఈ మూడు ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్ కు చికిత్సను అందిస్తున్నారు. ఎవరికైనా బ్లాక్ ఫంగస్ వచ్చినట్టు అనిపించినా.. ఆ లక్షణాలు ఉన్నా.. వెంటనే ఆ ఆసుపత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.