Black Sesame laddu Recipe : అమ్మమ్మల కాలం నాటి… రోటిలో చేసే నల్ల నువ్వుల లడ్డు…!
Black Sesame laddu Recipe : మన అమ్మమ్మలు చేసిన ఏ ఆహార పదార్థాలు అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా అన్నింటిని కొనుక్కొని తింటున్నాము. కానీ వీటి వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మన అమ్మమ్మల కాలంలో మన పెద్దలు చేసిన స్వీట్లు ఎంతో టేస్టీగా ఉండేవి. అందులో ఒకటి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తయారీ విధానం: ముందుగా కడాయి పెట్టుకుని అరకేజీ నల్ల నువ్వులు వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగడానికి 15 నిమిషాల సమయం పడుతుంది.
ఇవి పూర్తిగా చల్లారాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోటిలో కొద్దిగా వేసి గరుకుగా దంచుకోవాలి. గరుకుగా ఉంటే లడ్డూల టేస్ట్ బాగుంటుంది. రోటిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరుకుగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రోటిలో దంచుకోలేనివారు మిక్సీలో కూడా దంచుకోవచ్చు. అయితే ఇవి తినడానికి చేదుగా ఉండడం వలన చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటివారు టెస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం నువ్వులతో పాటు వేరుశనగ గుండ్లను వేసి రెండు కలిపి దంచుకోవచ్చు.
తర్వాత తిని తీపిని బట్టి మంచి క్వాలిటీ గల బెల్లాన్ని తీసుకోవాలి. వీలైనంతవరకు ఉప్పు బెల్లం కాకుండా ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మంచిది. బెల్లం నలిగిన తర్వాత దంచిన నువ్వులను కూడా వేస్తే బెల్లంతో కలిసేలా మరోసారి దంచుకోవాలి. అంత బాగా మిక్స్ చేసిన తర్వాత తీపి చెక్ చేసుకుని కావాలంటే కలుపుకోవచ్చు. నువ్వులకి ఎన్నో ఔషధ విలువలు ఉండడమే కాకుండా కొంచెం వేడి చేసే తత్వం కూడా ఉంటుంది కాబట్టి మరి పెద్ద లడ్డులు కాకుండా చిన్న సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. అన్ని వయసులు వాళ్లతో పాటు వయసు వచ్చిన ఆడపిల్లలు ఆడవాళ్లు తప్పకుండా తినాల్సిన లడ్డు ఇది.