Delhi Blast : ఢిల్లీలో దారుణం.. పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని.. మూడు కార్లు ధ్వంసం
చాలా రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న ఢిల్లీలో ఒక్కసారిగా బాంబుల మోత మోగింది. ఒక్కసారిగా ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఈ ఘటన అబ్దుల్ కలాం రోడ్ లో ఉన్న ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని వెంటనే కార్ల నుంచి చెలరేగిన మంటలను, పేలుడు ద్వారా వచ్చిన మంటలను ఆర్పేశాయి.
ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయి అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. ఐఈడీ బాంబు పేలినట్టు పోలీసులు గుర్తించారు.
రైతుల ఉద్యమం జరుగుతున్న సమయంలో పేలుళ్లు జరగడంతో అంతటా అప్రమత్తం
ఓవైపు ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లు ఉద్యమం చేస్తున్న సమయంలో.. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా జరిగిన తర్వాత.. మూడు రోజులకే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.
వెంటనే దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ముంబైలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తోంది.