Bomb Blast : మరో బాంబ్ బ్లాస్ట్.. 10మంది సైనికులు మృతి ఎక్కడంటే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bomb Blast : మరో బాంబ్ బ్లాస్ట్.. 10మంది సైనికులు మృతి ఎక్కడంటే !

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2025,5:00 pm

Bomb Blast : భారతదేశం పహల్గామ్ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే, పాకిస్తాన్‌లో మరో భారీ బాంబు పేలుడు కలకలం రేపింది. పశ్చిమ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహిస్తూ, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.

రిమోట్ కంట్రోల్ తో నడిపిన పేలుడు పరికరాన్ని ఉపయోగించి పారామిలిటరీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడిని నిర్వహించారు. ఈ దాడి క్వెట్టా సమీపంలోని మార్గట్ చౌకి వద్ద చోటుచేసుకుంది. భద్రతా వాహనం రోడ్డుపక్కన ఉంచిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌ను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది.

Bomb Blast మరో బాంబ్ బ్లాస్ట్ 10మంది సైనికులు మృతి ఎక్కడంటే

Bomb Blast : మరో బాంబ్ బ్లాస్ట్.. 10మంది సైనికులు మృతి ఎక్కడంటే !

ఈ దాడిలో సుబేదార్ షెహజాద్ అమీన్, నయాబ్ సుబేదార్ అబ్బాస్, సిపాయిలు ఖలీల్, జాహిద్, ఖుర్రం సలీం తదితరులు మృతి చెందారు. ఈ ఘటనలో భద్రతా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. BLA ప్రకటన ప్రకారం, ఆక్రమిత పాకిస్తాన్ దళాలపై తమ చర్యలు మరింత ఉగ్రంగా కొనసాగనున్నాయని హెచ్చరించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది