Blood Group : భార్యాభర్తలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉండకూడదా… వీరు పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా…?
ప్రధానాంశాలు:
Blood Group : భార్యాభర్తలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉండకూడదా... వీరు పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా...?
Blood Group : సమాజంలో చాలామంది వివాహం చేసేటప్పుడు , వారి బ్లడ్ గ్రూపులను పరీక్షించి వివాహం చేయడం లేదు. వారి బ్లడ్ గ్రూప్ ఒకే గ్రూపు ఉన్నది అనే విషయం వారికి , వివాహం జరిగే వరకు తెలియదు. అసలు భార్య భర్తలు ఇద్దరికీ ఒకే బ్లడ్ గ్రూప్ ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఇంతకీ ఇది నిజమా.. అబద్దమా..? ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే ఎదురయ్యే నష్టాలు ఏమిటి.. ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకుందాం. దాదాపుగా భారతదేశంలో సాధారణంగా పెళ్లి చేసే ముందు జాతకాలను చూసి నిర్ణయిస్తుంటారు. కొంతమంది అవగాహన ఉన్నవారు వైద్య పరీక్షలను కూడా నిర్వహిస్తుంటారు. వివాహం చేసుకున్న జంటలు తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తులో కలిగే పిల్లల ఆరోగ్యానికి అర్థం చేసుకోవడానికి టెస్టులు చేయించుకుంటున్నారు. అసలు ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు దంపతులు పెళ్లి చేసుకుంటే మంచిది కాదని భావిస్తారు. అసలు ఇది ఎంతవరకు నిజం..? ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమిటి..? ఈ సందేహాల గురించి పూర్తిగా తెలుసుకుందాం…

Blood Group : భార్యాభర్తలకు ఒకే బ్లడ్ గ్రూప్ ఉండకూడదా… వీరు పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా…?
Blood Group బ్లడ్ టైప్స్
బ్లడ్ టైప్స్ రెండు ప్రధాన వ్యవస్థల ద్వారా వర్గీకరించారు. ABO, Rh ఫ్యాక్టర్.- ABO బ్లడ్ గ్రూపులు, ఏ, B, AB, O,-Rh ఫ్యాక్టరీలో పాజిటివ్ లేదా నెగిటివ్ ఉంటాయి. Rh పాజిటివ్ అయితే రక్తంలో Rh యాంటిజన్ లు ఉంటాయి. Rh నెగిటివ్ అయితే రక్తంలో ఈ యాంటిజెన్స్ ఉండవు.
బ్లడ్ టైప్ ఎందుకు కీలకం : బ్లడ్ టైప్ అనుకూలతలు ప్రధాన ఆందోళన Rh ఫ్యాక్టర్ కి సంబంధించింది. తల్లి Rh- నెగిటివ్, తండ్రి ఆర్ హెచ్ పాజిటివ్ అయితే, శిశువు Rh పాజిటివ్ రక్తాన్ని వారసత్వంగా పొందితే సమస్యలు తలెత్తుతాయి. ఈ సందర్భంలో తల్లి శరీరం శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ( Antibodies ) ఉత్పత్తి చేయవచ్చు.
అయితే తల్లి గర్భధారణ సమయంలో యాంటీ -డి ఇంజక్షన్ ( Rho GAM లేదా Rhlg ) తో ఈ సమస్యను సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఈ ట్రీట్మెంట్ , సమస్యలకు ముందే చెక్ పెడుతుంది. ప్రసవం సురక్షితంగా జరిగేలా చేస్తుంది. అలా అని ఒకే బ్లడ్ గ్రూప్ ఉందని మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవలసిన అవసరం లేదు.
జన్యు పరీక్షలు, ఇతర ఆందోళనలు : రక్తం ద్వారా పిల్లలకు సంక్రమించే తల సేమియా లేదా ఇతర వ్యాధులను చెక్ చేయడానికి వైద్యులు Hb ఎలక్ట్రోప్రో రేసిస్ అనే టెస్ట్ ని సిఫారసు చేస్తారు. దగ్గర బంధువులను పెళ్లి చేసుకునేటప్పుడు జన్యుపరమైన రుగ్మతలు, పదేపదే గర్భస రావాలు జరిగే ప్రమాదం పెరుగుతుంది. దూల మధ్య వివాహం జరగాలని భావిస్తే, జెనెటిక్ కౌన్సెలింగ్, టెస్టులు చేయించుకోవాలి. ఇవి ముందుగా గుర్తించి భవిష్యత్తులో పిల్లలకు ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాలను అంచిన వేయడానికి, తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్త పరీక్షలు, జన్యు పరీక్షలు, సహ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ప్రతి జంటకు మేలు చేస్తుంది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఓకే బ్లడ్ గ్రూప్ ఎంత మందికి ఉంటుంది : మీ బ్లడ్ గ్రూప్ కి సరైన భాగస్వామిని ఎన్నుకొనడంలో సులభం లేదా కష్టం కావచ్చు. గతంలో యునైటెడ్ స్టేట్స్ లోని స్టాన్ ఫోర్ట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం… O+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు జనాలలో దాదాపు 37.4% మంది ఉన్నారు. O- గ్రూపు ఉన్నవారు దాదాపు 6.6% మంది ఉన్నారు. A+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు దాదాపు 35.7% మంది ఉన్నారు.
A- ఉన్న వ్యక్తులు జనాభాలో దాదాపు 6.3 శాతం మంది ఉన్నారు. B+ ఉన్నవారు దాదాపు 8.5 మంది ఉన్నారు. B- ఉన్న వారు దాదాపు 1.5% మంది ఉన్నారు. AB+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు దాదాపు 3.4% మంది ఉన్నారు. AB – బ్లడ్ గ్రూప్ ఉన్న వారివైతే జనాభాలో కేవలం 0.6 శాతం మంది ఉన్నారు.