Blue Tea : బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blue Tea : బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం…!!

Blue Tea : మన రోజువారి జీవితంలో టీ తాగనిదే రోజు కడవదు. అయితే ఈ టీ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మిల్క్ టీ,అల్లం టీ,మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ టీల గురించి మీరు వినే ఉంటారు. అయితే మీరు అన్ని రకాల టీ ల ను కూడా ట్రై చేసి ఉంటారు. అయితే ఈ బ్లూ టీ ని ఎప్పుడైనా ట్రై […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,7:00 am

Blue Tea : మన రోజువారి జీవితంలో టీ తాగనిదే రోజు కడవదు. అయితే ఈ టీ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మిల్క్ టీ,అల్లం టీ,మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ టీల గురించి మీరు వినే ఉంటారు. అయితే మీరు అన్ని రకాల టీ ల ను కూడా ట్రై చేసి ఉంటారు. అయితే ఈ బ్లూ టీ ని ఎప్పుడైనా ట్రై చేశారా. దీనిని రోజు తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ ని శంకుపూలతో తయారు చేస్తారు. అయితే ఈ శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ బ్లూ టీ ని బటర్ ఫ్లై పీ,ఫ్లవర్ పీ అని కూడా పిలుస్తారు. ఈ టీ అనేది నీలం రంగులో ఉంటుంది. అయితే ఈ బ్లూ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

ప్రతిరోజు ఈ బ్లూ టీ ని తీసుకోవటం వలన మన శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే ఈ అపరాజిత పూలాల్లో ఉన్న ఔషధ గుణాలు కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించి అధిక బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. ఈ టీ లో ఉన్న ఫైటో కెమికల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గొప్ప నిర్వీకరణ శక్తిని కలిగి ఉంటాయి. ఇది శరీరంలో ఉన్నటువంటి మలినాలను నియంత్రించి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ బ్లూ టీ ని ప్రతినిత్యం తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయాలను కూడా తగ్గిస్తుంది. దీంతో మీరు ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు. అయితే ఈ బ్లూ టీలో యాంటీ గ్లైకేసన్అనే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ బ్లూ టీ లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాక దీనిలో ఉన్న ఆంథోసైనిక్ స్కాల్ప్ పై బ్లడ్ సర్కులేషన్ ను కూడా పెంచుతాయి. ఈ బ్లూ టీ తో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ బ్లూ టీ లో ఉన్న పోషకాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎంతో వేగంగా పెరిగేలా చేస్తుంది. దీంతో మనల్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది…  ఈటీ ని ప్రతినిత్యం తీసుకోవడం వలన మానసిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది.

అలాగే ఒత్తిడి మరియు ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఈ బ్లూ టీ అనేది మెదడు ఆరోగ్యాన్ని కూడా పెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీని లో ఉన్న యాంటీ గ్లైసేటిన్ వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మం కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు ఈ టీ ని రోజు తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ బ్లూ టీ ని తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని వలన చర్మం ఎంతో ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ బ్లూ టీ లో ఆంథోసైనిన్స్ ఉండటం వలన తలలో రక్త ప్రసరణ పెంచేందుకు మరియు జుట్టు కుదుళ్ళ కు కూడా బలాన్ని ఇస్తుంది. ఈ బ్లూ టీ తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీంతో రెటీనా దెబ్బ తినటం, కంటి మచ్చల క్షీణత, గ్లాకోమా, అస్పష్టమైన దృష్టి లాంటి కంటి సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ టీ అనేది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుందని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది. ఇది కడుపు లో కండరాలను కదిలించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడంతో పాటుగా గట్ లో పురుగులు పెరగకుండా కూడా చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది