Blue Tea : బ్లూ టీ తాగితే కలిగే అద్భుతమైన ఆరోగ్య లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!
Blue Tea : ఆరోగ్యం పై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ సాధారణ టీలు కాకుండా హెర్బల్ టీ లు తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వాటిల్లో మనకు అనేక రకాల టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఇప్పుడు బ్లూ టీ ని అనే మరొక వెరైటీ టీ కొత్తగా వచ్చి చేరింది. ఇంతకు అసలు ఈ బ్లూ టీ అంటే ఏంటి.? దాన్ని ఎలా తయారుచేస్తారు.. దాంతో కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యూటీ పౌడర్ ను ట్యుటోరియ పెరటి అనే మొక్క పూలను ఎండబెట్టి తయారు చేస్తారు.
నిజానికి ఈ మొక్క మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనే కనిపిస్తూనే ఉంటుంది. దీని పువ్వులను తెంచి నీడలో ఎండబెట్టి పొడిచేయాలి. తర్వాత ఆ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంతో డికాషన్ తయారవుతుంది. దాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. రుచికి అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ బ్లూ టీ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
డయాబెటిస్ ఉన్నవారు బ్లూ టీ తాగితే బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్లూ టి లో బరువు తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్కలోని భాగాలు కొవ్వు కణాల పెరుగుదలను కరిగిస్తాయి. ఇది కొవ్వు కాలేయ వ్యాధి నుండి కాపాడుతుంది. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అనుకూలమైనవి.. అకాల వృద్ధాప్యం సంకేతాలను తగ్గిస్తాయి. తద్వారా యాంటీ గ్లైకేసన్ లక్షణాలు అందిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.. ఈ బ్లూ టీ ని నిత్యం తాగడం వలన యవ్వనంగా కూడా కనిపిస్తారు.