కోట్ల రూపాయలు దారి మళ్లించిన మెసెంజర్.. అతడిపై ఫిర్యాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కోట్ల రూపాయలు దారి మళ్లించిన మెసెంజర్.. అతడిపై ఫిర్యాదు

 Authored By praveen | The Telugu News | Updated on :3 September 2021,3:39 pm

 

చిత్తూరు జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కలికిరి బ్రాంచ్ ఇంటి దొంగను అధికారులు గుర్తించారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.26 లక్షల 95 వేలు దారి మళ్లించినట్లు శుక్రవారం బీఓబీ రీజినల్ మేనేజర్ ఎం.వి.శేషగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో మెసెంజరుగా ఉన్న ఆలీఖాన్ బ్యాంకు ఉద్యోగుల సాయంతో ఇంత డబ్బును దారి మళ్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలీఖాన్, తన వైఫ్ పేర్లతో ఉన్న జాయింట్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 16 వరకు జరిగిన ట్రాంజాక్షన్స్‌లో ఈ మొత్తం పక్కదారి పట్టినట్లు గుర్తించినట్లు మేనేజర్ వివరించారు.

ఇకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు ఉద్యోగులు రామచంద్రుడు, జయకృష్ణ, ఈలూ, ఈశ్వరన్‌ల‌ సస్పెండ్ చేశామని, మెసెంజర్ ఆలీఖాన్‌కు సహకరించిన ఇంకొంతమందిని బదిలీ చేశామని తెలిపారు. ఆలీఖాన్ మొత్తంగా ఎనిమిది ఖాతాల ద్వారా డబ్బులను వేరే వేరే చోట్లకు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. మొత్తంగా బీఓబీ జరిగిన అక్రమాలపై పోలీసులు ఇంకా వివరంగా విచారణ చేయనున్నారు. ఆలీఖాన్‌కు సంబంధించిన ఎనిమిది ఖాతాలపై పూర్తి విచారణ జరిపి ఆక్రమాలు బయటకు తీయనున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది