Amaravati..స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన అచ్చెన్నాయుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amaravati..స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన అచ్చెన్నాయుడు

మంగళవారం ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కమిటీ ఎదుట హాజరైన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఈ విషయమై ఎమ్మెల్యే జోగి రమేశ్ ఫిర్యాదు ఇచ్చారు. ఇకపోతే […]

 Authored By praveen | The Telugu News | Updated on :14 September 2021,4:23 pm

మంగళవారం ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కమిటీ ఎదుట హాజరైన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఈ విషయమై ఎమ్మెల్యే జోగి రమేశ్ ఫిర్యాదు ఇచ్చారు. ఇకపోతే అచ్చెన్నాయుడు తన తరఫున న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది. అనుమతి లేకుండా న్యాయవాదిని ఎలా తీసుకొచ్చారని అడిగింది. ఇక సమావేశం అనంతరం ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని.. ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో చాలా మంది సీనియర్ సభ్యులు అసెంబ్లీ వేదికగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న సంగతి అందరికీ విదితమే.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది