ఈయన మామూలు వ్యక్తి కాదు.. ఒకరికి తెలియకుండా మరొకరితో నాలుగు పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధం.. చివరికి..!
సాధారణంగా ఒకసారి పెళ్లి చేసుకుని చాలా మంది కష్టాలు పడుతున్నట్లు చెప్తుంటారు. కానీ, ఈయన మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఇంకో పెళ్లికి కూడా సిద్ధమని అంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఏపీలోని విశాఖపట్నంలో సీసీఆర్‌బీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అప్పలరాజు ఈ పని చేశాడు.
ఒకరికి తెలియకుండా మరొకరిని మొత్తం నలుగురు మహిళలను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి ద్వారా ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.ఇకపోతే తన నలుగురు భార్యల్లో పద్మ అనే ఆవిడకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ విషయాలన్నీ తాజాగా వెలుగులోకి వచ్చాయి. చేతన అనే మహిళ ఈ విషయాలను పేర్కొంటూ తాజాగా దిశ పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది.
సదరు కానిస్టేబుల్ నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నప్పటికీ తాజాగా మరో మహిళా కానిస్టేబుల్‌తో పెళ్లికి రెడీ అయిపోయాడని చేతన ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పలరాజును కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి తొలగించి అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చేతన డిమాండ్ చేసింది.