Lover Murder : ప్రియురాలిని గొంతు పిసికి చంపి కాల్చేసిన ప్రియుడు.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: April 28, 2023, 10:00 am

Lover Murder : మారుతీ రాథోడ్. కర్ణాటకలోని యాదగిరి తాలుకాకు చెందిన ఈ యువకుడు ఓ పెయింటర్. స్థానికంగా పెద్దగా పనులు లేకపోవడంతో పనుల కోసం ముంబైకి చేరుకొన్నాడు. అక్కడ ఒక పెయింటింగ్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ముంబైకి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత రాథోడ్ కు పెండెల వర్మ అనే యువతి పరిచయం అయింది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటుంది. ఆమెను ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్న రాథోడ్.. ఆ తర్వాత ఆమెను ప్రేమించాడు. వర్మ కూడా తనను ప్రేమించింది.

ఇద్దరూ కలిసి ముంబైలో చెట్టాపెట్టాలేసుకొని తిరిగారు. ఇంతలో పెండెల వర్మకి సోషల్ మీడియాలో ఆదరణ పెరిగింది. దీంతో మరింత ఉత్సాహంలో వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. కొందరు యువకులతో కలిసి రీల్స్ చేయడం మొదలు పెట్టింది వర్మ. మగాళ్లతో కలిసి డ్యాన్స్ లు చేయొద్దంటూ రాథోడ్.. వర్మను కోరాడు. కానీ.. వర్మ పట్టించుకోలేదు. ఇంకా రెచ్చిపోయింది. తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరుగుతుండటంతో తను పలువురు యువకులతో డ్యాన్సులు చేయడం మొదలు పెట్టింది. తన మాట వినని పెండెల వర్మను ఎలాగైనా చంపేయాలని అనుకొని ఒకరోజు వర్మను తన ఊరికి తీసుకెళ్లాడు.

boy friend kills l0ver in karnataka

boy friend kills l0ver in karnataka

Lover Murder : మగాళ్లతో కలిసి డ్యాన్స్ లు చేయడం తట్టుకోలేకపోయిన రాథోడ్

అక్కడ ఊరి చివర వర్మ గొంతు నులిమి ప్రాణాలు తీసి ఒక పొలంలోకి తీసుకెళ్లి ఆమె శరీరాన్ని కాల్చేశాడు. ఊరి పొలిమేరలో సగం కాలిన యువతి శవం ఉందనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాస్తంత దూరంగా పడి ఉన్న సెల్ ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ ద్వారా ఆమె ఎవరు, ఆమెతో చివరి సారి ఫోన్ లో మాట్లాడింది ఎవరు అనేది తెలిసిపోయింది. హంతకులు గుట్టుగా ఊరిలోనే ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఇంటిని చుట్టుముట్టి మారుతిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య తానే చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

https://www.youtube.com/watch?v=L05yVNjf38E

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp