Ys Jagan : సోదరుడు చిరంజీవి.! ఇది కదా సీఎం వైఎస్ జగన్ అంటే.!
Ys Jagan : సినిమా టిక్కెట్ల ధరల విషయమై గతంలో నానా యాగీ జరిగింది. ఆ సమయంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వంపై నానా రకాల విమర్శలూ చేశారు. కానీ, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, సినీ పరిశ్రమకు పెద్దన్నగా వ్యవహరించారు.. ఆయన అలా ‘పెద్దన్న’ బాధ్యత తీసుకోవడం, సినీ పరిశ్రమలో కొందరికి నచ్చలేదు.
అయితే, చిరంజీవిని ‘సోదరుడిగా’ భావించి, ఆ పెద్దరికం ఆయనకు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు.
సినిమా టిక్కెట్ల ధరల అంశం సహా, పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు అంశాలపై వైఎస్ జగన్ అప్పట్లో దూరదృష్టితో ఆలోచించి, సముచిత నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవిని పలుమార్లు సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్, అనూహ్యంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. టిక్కెట్ల ధరల విషయంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు తనను కలిసిన సందర్భానికి సంబంధించి. చిరంజీవికి సముచిత గౌరవం ఇవ్వలేదంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. అయితే, కాస్త వేచి చూసిన వైఎస్ జగన్, సమయం చూసి.. చిరంజీవిపై తనకున్న సోదరభావాన్ని చాటుకున్నారు.
భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ నేపథ్యంలో చిరంజీవికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రత్యేక ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ, ‘సోదరుడు చిరంజీవి’ అన్నారు వైఎస్ జగన్. దాంతో ఒక్కసారిగా ఆ సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.. జై జగన్.. జై చిరంజీవి నినాదాలతో. ఇది కదా వైఎస్ జగన్ అంటే.. అంటూ వైసీపీ శ్రేణులు అనుకోవడం కనిపించింది. అదే సమయంలో చిరంజీవి పట్ల వైఎస్ జగన్‌కి వున్న సోదర భావాన్ని చిరంజీవి అభిమానులూ అర్థం చేసుకున్నారు.