Banana | మధుమేహం ఉన్నవాళ్లూ అరటిపండు తినవచ్చా? .. నిపుణుల తాజా సూచనలు ఇవే!
Banana | అరటిపండు… భారతీయుల డైట్‌లో ఒక సాధారణమైన, ఆరోగ్యకరమైన పండు. గుడిలో ప్రసాదంగా, టిఫిన్‌కు తోడుగా, వ్యాయామం తర్వాత శక్తివంతమైన స్నాక్‌గా… అనేక రకాలుగా ఉపయోగించే ఈ పండు గురించి మధుమేహం (షుగర్) ఉన్నవాళ్లలో మాత్రం కొన్ని సందేహాలు ఉండటం సహజమే. “అరటిపండు తినొచ్చా? తింటే షుగర్ పెరుగుతుందా?” అనే ప్రశ్నలు చాలామందిని వేధిస్తున్నాయి.
అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కేవలం తినే విధానం, పరిమాణం, మరియు టైమింగ్‌ను సరిగ్గా అనుసరిస్తే ఇది శరీరానికి మేలు చేస్తుందనీ చెబుతున్నారు.
#image_title
అరటిపండు ఎందుకు మంచిది?
నెమ్మదిగా శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు
రక్తంలో చక్కెర శోషణను నియంత్రించే ఫైబర్
పొటాషియం వల్ల కండర శక్తి, అలసట నివారణ
విటమిన్లు (C, B6) – రోగనిరోధక శక్తి పెంపు
విటమిన్ B6 ద్వారా మానసిక ప్రశాంతత
షుగర్ ఉన్నవాళ్లు అరటిపండ్లు తినొచ్చా?
తినొచ్చు… కానీ నియంత్రణతో!
అరటిపండు మితమైన గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగిన పండు. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తక్కువగా, నెమ్మదిగా పెంచుతుంది. అయినప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల ప్రమాదం ఉండవచ్చు. అందుకే తినే పరిమాణంపై కట్టడి అవసరం.
ఎప్పుడు తినాలి?
ఉదయం టిఫిన్ తర్వాత లేదా
మధ్యాహ్నం స్నాక్‌గా తీసుకోవడం ఉత్తమం.
మధుమేహం ఉన్నవారికి సూచనలు…
చిన్న పరిమాణంలో తినండి – పెద్ద పండు బదులుగా సగం లేదా చిన్న అరటిపండు తీసుకోండి.
పర్యవేక్షణ చేయండి – తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి.
తేలికపాటి వ్యాయామం చేయండి – నడక లేదా లైట్ యాక్టివిటీ చక్కెరను శక్తిగా మార్చుతుంది.
బియ్యం, బ్రెడ్‌తో కలిపి తినకండి – మితమైన కార్బ్స్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.