Nails | గోళ్లపై తెల్లని మచ్చల అర్థం ఏమిటి? .. శుభ సంకేతాలుగా జ్యోతిష నిపుణుల అభిప్రాయం
Nails | మన గోళ్లపై కొన్నిసార్లు తెల్లని చుక్కలు లేదా మచ్చలు కనిపిస్తాయి. చాలామంది వీటిని కాల్షియం లోపం లేదా ఆరోగ్య సమస్యలుగా భావిస్తారు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇవి ఆరోగ్య సమస్యలు కాకుండా శుభ సంకేతాలు అని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తెల్లటి మచ్చలు మీ జీవితంలో సానుకూల మార్పులు, అదృష్టం, కొత్త అవకాశాలను తెస్తాయి.
#image_title
చూపుడు వేలుపై మచ్చలు
మీ కుడి చేతి చూపుడు వేలుగోలుపై తెల్లని మచ్చ ఉంటే, అది కెరీర్‌లో విజయాన్ని సూచిస్తుంది. మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఎడమ చూపుడు వేలుగోలుపై మచ్చ ఉంటే కొత్త కెరీర్ ప్రారంభం లేదా వివాహం వంటి శుభకార్యాలకు సంకేతంగా పరిగణిస్తారు.కుడి చేతి మధ్య వేలు గోరుపై తెల్లటి మచ్చలు ఉంటే, త్వరలోనే ఉన్నత స్థానం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎడమ మధ్య వేలు గోరుపై మచ్చ ఉంటే ప్రేమ, వివాహ జీవితంలో విజయాలు సాధిస్తారు.
కుడి ఉంగరపు వేలుపై మచ్చ సానుకూల శక్తిని సూచిస్తుంది. కళా రంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది కొత్త అవకాశాల సంకేతం. ఎడమ చేతి ఉంగరపు వేలుపై మచ్చ ఉంటే, ఆకస్మిక ఆదాయం, లాటరీ లేదా పెట్టుబడుల లాభాలు వచ్చే సూచన. కుడి చిన్న వేలుపై తెల్లటి మచ్చలు ఉండటం కోరికలు నెరవేరడాన్ని సూచిస్తుంది. ఎడమ చిన్న వేలుపై మచ్చలు వృత్తి మరియు వ్యక్తిగత పురోగతికి సంకేతం. కుడి బొటనవేలు గోరుపై తెల్లని మచ్చలు ఉండటం శాశ్వత సంబంధం లేదా జీవిత భాగస్వామిని కలవబోతున్నారనే సంకేతంగా పరిగణిస్తారు. ఎడమ బొటనవేలు గోరుపై మచ్చలు ఆశయాల సాధన, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయాన్ని సూచిస్తాయి.