CBI : బ్రేకింగ్.. ఏపీలో సిబిఐ కలకలం, ఎందుకీ దాడులు…?
CBI : ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ అధికారులు ఈ మధ్య కాలంలో వరుసగా సోదాలు నిర్వహించడం సంచలనంగా మారుతుంది. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏంటీ అనే దానిపై స్పష్టత లేకపోయినా ఎక్కువగా ఉద్యోగులు, బ్యాంకు అధికారుల లక్ష్యంగా జరుగుతున్నాయి అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇక అధికార పార్టీ నేతలను లక్షంగా చేసుకున్నారు అనే ప్రచారం కూడా కాస్త గట్టిగానే జరుగుతుంది.ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు అనే దానిపై క్లారిటీ లేదు.
ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఏపీలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీలోని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఏపీలో 40 చోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ… ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగుల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది.ప్రావిడెంట్ ఫండ్ క్లియరెన్స్ కోసం లంచాలు తీసుకుంటున్నారు అని కూడా గుర్తించింది.
పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారా డబ్బులను తీసుకుంటున్న ఉద్యోగస్థులను మీద ఎక్కువగా దృష్టి సారించింది. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లిలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్‌లో జరిగిన అక్రమాలపై 4 కేసులు నమోదు చేసిన సీబీఐ… పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తుంది.