తిరుపతి ఉప ఎన్నికల యుద్దంలో దిగిన ‘సీబీఎన్ ఆర్మీ’.. జగన్ కు షాక్ తప్పదా?
CBN Army : తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్నా కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారంను మరింత ముమ్మరం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్న వైకాపా మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా యువత మరియు మహిళలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థతో ఇంటింటికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ చేసిన అభివృద్దిని ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక తెలుగు దేశం పార్టీ మాత్రం రెగ్యులర్ మూస పద్దతిలో ఇన్ని రోజులు ప్రచారం చేసింది. ఎట్టకేలకు కొత్త పద్దతిన ప్రచారంకు తెలుగు దేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టబోతున్నారు.
CBN Army : సీబీఎన్ ఆర్మీ రంగంలోకి…
సాదారణ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా టీమ్స్ ప్రభావవంతంగా పని చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియా విభాగంలో తెలుగు దేశం పార్టీని మించిన వారు లేరు అనడంలో సందేహం లేదు. అలాంటి సోషల్ మీడియా టీమ్స్ ను కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో సీబీఎన్ ఆర్మీని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంట్ నియోజక వర్గం వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక సీబీఎన్ ఆర్మీ మెంబర్ ను ఇచ్చి వారిని ఎడ్యుకేట్ చేయడంతో పాటు వారికి తెలుగు దేశం పార్టీ పట్ల అవగాహణ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

TDP Ys jagan
ముగింపు ప్రచారం…
తిరుపతి ఉప ఎన్నికల ముగింపు ప్రచారంను పెద్ద ఎత్తున చేసేందుకు గాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు దేశం పార్టీ సీబీఎన్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసే యువతను రంగంలోకి దించడం జరిగింది. వీరు చేసే హంగామాతో మొత్తం ఫలితం తారు మారు చేయాలని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు సాకారం అవుతుంది అనేది చూడాలి. తెలుగు దేశం పార్టీ గెలుపు కోసం పోరాటం చేస్తూ ఉంటే వైకాపా మాత్రం లక్షల మెజార్టీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చూడాలి.