Good News : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం… ఇలా చేస్తే మూడు లక్షలు మీకే..!!
Good News : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతుల విషయంలో కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తర్వాత…బీజేపీ అన్నదాతల విషయంలో సరికొత్త పథకాలు అమలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల వల్ల చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు. దీనిలో భాగంగా రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొన్ని స్కీమ్స్ లలో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం. ఈ పథకం ద్వారా చక్కటి లాభాలు పొందవచ్చు. పశుసంవర్ధక, మత్స్య, వ్యవసాయ రంగాలలోని రైతులు…
అవసరమైన లోన్ లు పొందుకొనే అవకాశం కేంద్రం కల్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకి తక్కువ వడ్డీకి.. బ్యాంకులో రుణాలు కలిపించే దిశగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతుల గరిష్టంగా ₹3 లక్షల వరకు లోన్ అందుకునే అవకాశం కేంద్రం కల్పించింది. అదేవిధంగా ఈ స్కీం ద్వారా భీమాని కూడా అందుకోవచ్చు. శాశ్వత వైకల్యం లేదా మరణిస్తే సదరు కుటుంబానికి 50వేల రూపాయల వరకు వస్తాయి.ఇంకా వేరే ఏమైనా ప్రమాదాలు జరిగితే 25 వేల వరకు బీమా పొందుకోవచ్చు.
అంతేకాదు ₹1.60 లక్షల వరకు ఎటువంటి హామీలు అవసరం లేదు. అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పండుకోవాలంటే సదరు రైతుకి 18 నుంచి 75 సంవత్సరాల లోపు వయసుతో పాటుగా పొలం పత్రాలు ఉండాలి. కౌలు, వాటాదారులు, మౌఖిక కౌలుదారులు… కూడా అర్హులే. అయితే కార్డు అప్లై చేసుకునే వారికి ప్రాసెసింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మొదటిగా కిసాన్ క్రెడిట్ కార్డ్ పై 50వేల వరకు లోన్ అందిస్తారు. సరైన టైంకి మొదటి లోన్ కట్టేస్తే తర్వాత మూడు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ కూడా జరుగుద్ది.