Central Government : ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం శుభవార్త
Central Government : ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. తెలంగాణ కంటే ఏపీలో ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులకు ఇచ్చే వేతనం కూడా ఇవ్వలేని స్థితిలోకి ఏపీ సర్కారు వెళ్లిందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సర్కారు కేంద్రం ఇచ్చే గ్రాంట్స్ లేదా రుణాల కోసం ఎదురు చూస్తున్నది. అప్పులు చేస్తూ చేస్తూ ఏపీ సర్కారు అప్పులమయం అయిందనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు గుడ్ న్యూస్ చెప్పింది.పన్నుల వాటాలా రావాల్సిన నిధులను విడుదల చేసింది.
ప్రతీ నెల కేంద్రం ఇచ్చే గ్రాంట్ కోసం ఏపీ సర్కారు ఎదురు చూస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్రం విడుదల చేసిన గ్రాంట్స్‌తో ఏపీ ప్రభుత్వం హ్యాపీ అయినట్లుంది. పన్నుల వాటాల కింద ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ ను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. ఏపీకి రూ.3,847 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. ఏపీకి వచ్చిన నిధుల ద్వారా సర్కారు తన వ్యవహారాలను చక్కబెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి.ఇకపోతే వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత వాటాను కేంద్రం రాష్ట్రాలకు కేటాయిస్తుంటుంది.
అలా ఈ సారి రాష్ట్రప్రభుత్వాలకు చెల్లించే పన్నుల వాటాను కేంద్రం చెల్లించింది.ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఒకేసారి రెండు వాయిదాలను విడుదల చేసినట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు ఊరట కలిగించేందుకుగాను నిధులు విడుదల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల వాయిదా కింద రాష్ట్రాలకు మొత్తంగా రూ.రూ.57,541 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉంది. కాగా, ఈ సారి మరో నెల వాయిదా రూ.47,541 కోట్లు కూడా కలిపి విడుదల చేసింది కేంద్రం.