7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జులై 1 నుంచి పెరగనున్న డీఏ.. భారీగా పెరగనున్న జీతాలు.. ఎంతంటే?
7th Pay Commission : ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు డీఏ పెంపు కోసం. సాధారణంగా డీఏ పెరిగినా చాలు.. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరుగుతాయి. గత సంవత్సరం జులైలో 17 శాతంగా ఉన్న డీఏను కేంద్రం 28 శాతం చేసింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు డీఏను పెంచింది. అంటే.. అక్టోబర్ 2021 లోపు మూడు సార్లు డీఏ పెరిగింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉంది.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది కేంద్రం. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలలలో డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. కానీ.. ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది.కరోనా వల్ల.. జనవరి 2020 నుంచి జూన్ 30, 2021 వరకు డీఏ పెంపు జరగలేదు. కానీ.. గత సంవత్సరం జులైలో మాత్రం ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు డీఏ పెరిగింది.
7th Pay Commission : ఈసారి డీఏ ఎంత పెరుగుతోందంటే?
జనవరి 1, 2022 నుంచి మూడు సార్లు పెరిగిన డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏను జులై 1, 2022 నుంచి కేంద్రం పెంచనుంది. బేసిక్ పే రూ.18,000 ఉంటే.. డీఏ రూ.540 పెరుగుతుంది. ఒకవేళ బేసిక్ పే రూ.25,000 ఉంటే.. డీఏ రూ.750 పెరుగుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటే.. నెలకు డీఏ రూ.1500 పెరుగుతుంది. డీఏ పెంపుతో పాటు.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను కూడా కేంద్రం పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిట్ మెంట్ 2.57 ఉంది. దాన్ని 3.68 కు మార్చాలనే డిమాండ్ ఉంది.