7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం ఈ కొత్త రూల్స్ తెలుసుకున్నారా?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కొత్త రూల్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కొత్త రూల్స్ ప్రకారం.. బేసిక్ పే ప్రకారం రూ.50 వేల జీతం దాటిన వారు ప్రైవేటు ఆసుపత్రుల వార్డులను పొందొచ్చు. సీజీహెచ్ఎస్( సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్),Central Government Health Scheme, పేరుతో కేంద్ర ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగుల కోసం హెల్త్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివిధ రకాల చికిత్సలను చేయించుకోవచ్చు.
ఏడవ వేతన సంఘం సిఫారసు ప్రకారం.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో వార్డుల అర్హత నిబంధనలను సవరించింది. వాళ్ల బేసిక్ పే ప్రకారం వార్డులలో చేరే అర్హత ఉంటుంది. రూ.50,500 బేసిక్ పే కంటే ఎక్కువ ఉంటే.. వాళ్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రైవేటు వార్డులను పొందొచ్చు. ఒకవేళ రూ.36,500 వరకు బేసిక్ పేను పొందుతున్న ఉద్యోగులు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో జనరల్ వార్డులకు అర్హత పొందుతారు. ఇక.. రూ.36,501 నుంచి రూ.50,500 మధ్య బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు సెమీ ప్రైవేట్ వార్డులకు అర్హత ఉంటుంది.
7th Pay Commission : రూ.36,501 నుంచి రూ.50,500 వరకు బేసిక్ పే ఉన్న వాళ్లకు సెమీ ప్రైవేట్ వార్డులకు అర్హత
ఈ నిబంధనలు 28 అక్టోబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి. నిజానికి బేసిక్ పే రూ.36,500 వరకు జనరల్ కిందికే వస్తుంది. కానీ.. రూ.36,500 నుంచి రూ.50,500 లోపు ఉంటే.. దాన్ని సెమీ ప్రైవేటుగా నిర్ణయించారు. ఒకవేళ రూ.50,500 దాటితేనే దాన్ని ప్రైవేటుగా పేర్కొన్నారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా, నిర్మించాలనుకున్నా.. దానికి తక్కువ రేటుకే అంటే 7.1 శాతానికే హెచ్బీఏ నిబంధనల ప్రకారం రూ.25 లక్షల వరకు లోన్ ను అందిస్తారు.