7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 18 నెలల డీఏ బకాయిలు అకౌంట్లోకి.. ఎప్పుడంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న 18 నెలల డీఏ బకాయిలపై కేంద్రం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ బకాయిలపై కేంద్రం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఆతృతతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు 18 నెలల డీఏ బకాయిలు కేబినేట్ లో చర్చకు పెండింగ్ లో ఉన్నాయి.
18 నెలల డీఏ బకాయిలను చెల్లించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. లేవల్ 3 ఉద్యోగులకు కనీసం రూ.11,880 నుంచి రూ.37,554 వరకు అందనున్నాయి. అలాగే.. లేవల్ 13, లేవల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు అందనున్నాయి. మూడు వాయిదా పద్ధతుల్లో కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించనుంది. 28 సెప్టెంబర్ 2022న డీఏ, డీఆర్ ను 4 శాతం పెంచుతూ యూనియన్ కేబినేట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభం చేకూరింది.
7th Pay Commission : సెప్టెంబర్ 2022 న పెరిగిన 4 శాతం డీఏ
జూన్ 2022 న ఉన్న ఇండియా కంజ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సంవత్సర యావరేజ్ ప్రకారం.. కేంద్రం 4 శాతం డీఏను పెంచింది. పెరిగిన డీఏ వల్ల కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.6591.36 కోట్లు నష్టం వాటిల్లింది. కేవలం జూన్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకే రూ.4394.24 కోట్ల భారం పడనుంది. ప్రతి సంవత్సరం డీఏ, డీఆర్ ను రెండు సార్లు కేంద్రం రివైజ్ చేస్తుంది. జనవరి, జులైలో డీఏను పెంచుతూ ఉంటుంది. తాజా పెంపు వల్ల 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరింది. గత మార్చిలో కేంద్రం 34 శాతానికి డీఏను పెంచగా.. సెప్టెంబర్ లో 38 శాతానికి పెంచింది.